IPL 2025: ఉప్పల్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌లు.. రాచకొండ సీపీ కీలక ఆదేశాలు!

ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. మ్యాచ్‌ల కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. మార్చి 23న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య మ్యాచ్ జరగనుంది. 

New Update
uppal ipl 2025

uppal ipl 2025

ఉప్పల్‌ క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు.  ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు.  2 వేల 700 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్న సీపీ...  300 మంది ట్రాఫిక్ పోలీసులు, లా అండ్‌ ఆర్డర్‌లో 1,218 మంది, 12 మంది బెటాలియన్లు, 2 ఆక్టోపస్ బృందాలు, 10 మౌంటెడ్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.  

Also read :  బాగా ఫీల్ అయినట్టున్నాడు... పెళ్లికి పిలువలేదని కాల్చి పారేశాడు!

అంతేకాకుండా ఉప్పల్ స్టేడియంలో 450 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. స్టేడియంలోనే ప్రత్యేక కంట్రోల్‌ రూమ్ ఏర్పాటు చేసి ఏసీపీ సారథ్యంలో భద్రతను పర్యవేక్షించనున్నట్లుగా తెలిపారు. ఇక స్టేడియం ఎంట్రన్స్‌ వద్ద స్నిపర్‌ డాగ్స్‌, బాంబ్‌ స్క్వాడ్‌తో పోలీసులు తనిఖీలు చేపట్టనున్నారు.  అభిమానుల కోసం స్పెషల్ గా ఐదు చోట్ల  పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశారు.  

Also read :  అవన్నీ తూచ్.. ఛాంపియన్స్ ట్రోఫీ వల్ల లాభపడ్డాం: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు

ఆ వస్తువులపై నిషేధం

ఐపీఎల్‌ మ్యాచ్‌లు చూసేందుకు వచ్చే అభిమానులు వాటర్ బాటిల్స్, ల్యాప్‌టాప్‌, అగ్గిపెట్టెలు, పలు ఎలక్ట్రానిక్‌ వస్తువులను నిషేధం విధించారు.  కాగా రేపటి నుంచి అంటే మార్చి 22వ తేదీ నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. మార్చి 23న ఉప్పల్‌ మైదానంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ కోసం 3 గంటల ముందే గేట్లు ఓపెన్ చేస్తామని, ప్రేక్షకులు ముందుగానే స్టేడియానికి చేరుకోవాలని పోలీసులు సూచించారు. మ్యాచ్ లు జరిగిన సమయాల్లో అర్థరాత్రి వరకు మెట్రో సర్వీసులు ఉంటాయని వెల్లడించారు.  

Also read :  PAK vs NZ : వారేవా పాకిస్థాన్.. న్యూజిలాండ్కు చుక్కలు చూపించింది!

Also Read :  పదో తరగతి పరీక్షల్లో గందరగోళం ఒక పేపర్ కు బదులు మరో పేపర్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు