NASA: మనుషులు ఉండడానికి మరో గ్రహం..మార్స్ మీద బోలెడంత నీరు

అంగారకుడి మీద బోలెడంత నీరు ఉందని చెబుతున్నారు నాసా శాస్త్రవేత్తలు. మార్స్ మీద ఉన్న రాళ్ళ కింద పొరల్లో నీరు ఉందని కనుగొన్నారు. ఇవన్నీ కలిపితే సముద్రాలు ఏర్పడతాయని చెప్పారు. దీంతో భవిష్యత్తులో మానవులు ఇక్కడ నివసించడానికి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

NASA: మనుషులు ఉండడానికి మరో గ్రహం..మార్స్ మీద బోలెడంత నీరు
New Update

Water On Mars: భూమి మీద వనరులు తగ్గిపోతున్నాయి. రోజురోజుకూ కాలుష్యం ఎక్కువైపోతోంది. దీంతో ఓజోన్ పొర దెబ్బ తింటోంది. దాంతో పాటూ జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. ఇది ఇంకా ఎక్కువ అయితే భూమి మీద ప్లేస్ సరిపోదని భయం ఎక్కువ అవుతోంది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు చాలా రోజు క్రితం నుంచి మానవుల నివాసానికి అనువైన మరొక గ్రహం కోసం వెతుకుతూనే ఉన్నారు. చంద్రుడు, అంగారకుడు ఇలా..ఇతర గ్రహాల మీద పరిశోధనలు చేస్తున్నారు. వీటికి ఇప్పటికి ఫలితం కనిపించింది.

మానవుడు ఎక్కడైనా ఉండాలంటే అన్నింటికంటే ముందు ముఖ్యమైనది నీరు. నీరు ఉంటేనే మిగతావన్నీ సమకూర్చుకోగలడు. కాబట్టి సైంటిస్టులు కూడా ఇతర గ్రహాల మీద నీరు కోసమే ఇన్నాళ్ళు వెతికారు. తాజాగా జరిపిన పరిశోధనల్లో మార్స్ మీద నీరు ఉందని మొత్తానికి కనుక్కోగలిగారు. అంగారకుడి మీద ఉన్న భూమి మొత్తం రాళ్ళతో నిండిపోయింది. కానీ వాటి కింద నీరు నిక్షిప్తమై ఉందని చెబుతున్నారు నాసా సైంటిస్టులు. ఉపరితలం కింద ఉన్న అపారమైన నీటి నిల్వలను నాసా కనుగొంది. సముద్రాన్ని నింపడానికి ఈ నీరు సరిపోతుందని చెబుతోంది. ఉపరితలం నుండి అనేక కిలోమీటర్ల దిగువన రాళ్ళలో పగుళ్లు ఉన్నాయి.ఉపరితలం నుండి అనేక కిలోమీటర్ల దిగువన రాళ్ళలో పగుళ్లు ఉన్నాయి. ఈ పగుళ్ల మధ్య నీరు ఉంది. అదంతా సేకరించగలిగితే సముద్రం అంత నీరు వస్తుంది అని చెబుతోంది.

మార్స్ ఉపరితలం నుండి 11.5 నుండి 20 కిలోమీటర్ల లోతులో పెద్ద మొత్తంలో నీరు ఉంది. ఇందులో చిన్న సూక్ష్మజీవులు ఉండే అవకాశం కూడా ఉంది. లేదా ఇంతకు ముందు కూడా ఉండవచ్చు అంటున్నారు శాన్ డియాగోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని స్క్రిప్స్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఓషనోగ్రఫీలో ప్లానెటరీ శాస్త్రవేత్త వాషన్ రైట్. మార్స్ లో 11.5 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల లోతులో రాళ్ల పగుళ్ల మధ్య నీరు ఉండొచ్చు. ఈ మొత్తం నీటిని సేకరిస్తే, మార్స్ ఉపరితలంపై 1 నుండి 2 కిలోమీటర్ల లోతైన సముద్రాన్ని నింపవచ్చు. అది కూడా ఒక్క చోట కాదు మొత్తం గ్రహం అంతా అని చెబుతున్నారు.

సెస్మిక్ డేటా ఆధారంగా నీటిని గుర్తించామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 4 ఏళ్ల క్రితం ల్యాండర్‌తో మార్స్‌పైకి వెళ్లిన సిస్మో మీటర్ డేటా సేకరిస్తూనే ఉంది. అయితే ఇప్పటివరకు నీటి ఆవిరిని మాత్రమే గుర్తించాము. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారి నీటిని కూడా గుర్తించగలిగామని చెప్పారు. మార్స్ ధృవాల దగ్గర 6 - 12 మైళ్ల లోతున నీటి జలాశయాలు ఉన్నాయి.  అంగారక గ్రహం నిండా ఇలాంటి జలాశయాలు ఉండే ఛాన్స్ ఉందని నాసా సైంటిస్టులు చెప్పారు.

ప్రస్తుతం అంగారకుడి ఉపరితలం చల్లగా ఉంది. కానీ ఒకపపుడు ఇదో పెద్ద ఎడారి అని చెబుతున్నారు నాసా శాస్త్రవేత్తలు. అందుకే చాలా సార్లు వేడిగా కూడా ఉంటుంది. ఇది 300 కోట్ల సంవత్సరాల క్రితం మారిపోయింది. అయితే అప్పుడు కూడా అంగారకుడిపై ఉన్న నీరు అంతరిక్షంలోకి కనుమరుగైపోలేదని అధ్యయనంలో తేలింది. ఆ నీరు అంతా క్రస్ట్ పొర ద్వారా ఫిల్టర్ చేయబడి..రాళ్ళ లోపల పేరుకుపోయింది అని చెప్పారు. మార్స్ ఏర్పడిన మొదట్లో దాన మీద నదుల, నీటి సరస్సులు ఉండేవి. అప్పుడు సముద్రం కూడా ఉండి ఉండవచ్చునని మా అంచనా అంటున్నారు వాషన్ రైట్. ఇప్పుడు మళ్ళీ నీరు ఉందని తెలియడం చాలా ఆనందంగా ఉందని...దీంతో మానవుడు భవిష్యత్తులో ఇక్కడ ఉండొచ్చనే ఆశ కలుగుతోందని అన్నారు.

#scientists #nasa #mars #water
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe