Bandi Sanjay: బండి సంజయ్ క్రేజ్‌కు మోదీ షాక్‌

ఢిల్లీలోని ఆదివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో గట్టిగా కేకలు వినిపించాయి. దీంతో ఆయన క్రేజ్ చూసి ప్రధాని మోదీ ఆశ్చర్యపోయారు.

New Update
Bandi Sanjay: బండి సంజయ్ క్రేజ్‌కు మోదీ షాక్‌

Bandi Sanjay: ఢిల్లీలోని ఆదివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రమాణస్వీకారోత్సవం కార్యక్రమంలో నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో 71 మంది ఎంపీలు మంత్రులుగా ప్రమాణం చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 5 గురు ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. వీళ్లలో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఆంధ్రప్రదేశ్‌ నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు (టీడీపీ), పెమ్మసాని చంద్రశేఖర్‌ (టీడీపీ), శ్రీనివాస వర్మ(బీజేపీ) ఉన్నారు. ఇక బండి సంజయ్‌ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో గట్టిగా కేకలు వినిపించాయి. దీంతో ఆయన క్రేజ్ చూసి ప్రధాని మోదీ ఆశ్చర్యపోయారు. ఇదిలాఉండగా.. ప్రధాని మోదీతో పాటు 30 మంది కేబినేట్‌ మంత్రులు, 5 గురు సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా), 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు.

Also read: గ్రూప్‌ -4 మెరిట్‌ అభ్యర్థుల జాబితా విడుదల

Advertisment
తాజా కథనాలు