TDP Lokesh: సీఎం జగన్ పై విమర్శల దాడికి దిగారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. మూడు ముక్కలాటతో ప్రజా రాజధాని అమరావతిని (Amaravati) నాశనం చేశారు మండిపడ్డారు. జగన్ (CM Jagan) విధ్వంసం ఆరంభించి నాలుగేళ్లు పూర్తయిందని ఎద్దేవా చేశారు. వైసీపీ (YCP Party) ప్రభుత్వ పాలనలో రూ.వేల కోట్ల విలువైన భవనాలు శిథిలం చేశారని మండిపడ్డారు. భూములు ఇచ్చిన రైతులను హింస పెట్టారని పేర్కొన్నారు. రోడ్లు, మౌలిక సదుపాయాలు ధ్వంసం చేయించారని ఆరోపణలు చేశారు. జగన్ అరాచక పాలన మూడు నెలల్లో ముగిసిపోతుందని జోస్యం చెప్పారు. ప్రజా రాజధాని అమరావతి అజరామరమై నిలుస్తుందని అన్నారు.
ALSO READ: కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
నారా లోకేష్ ట్విట్టర్(X) లో జగన్ పై సెటైర్లు వేస్తూ ట్వీట్ చేశారు. లోకేష్ ట్వీట్ లో.. పేదోళ్ల భూములు కొట్టేయడానికే జలగన్న“భూభక్ష…” ఇవి సర్వేరాళ్లే మీ అరాచక సర్కారుకు సమాధిరాళ్లు!!, ఇవి యలమంచిలి నియోజకవర్గం తోటాడ వద్ద జగనన్న భూరక్ష పేరుతో సిద్ధంగా ఉన్న హద్దురాళ్లు. పరిపాలనకంటే స్కిక్కర్లు, బొమ్మలకే పెద్దపీట వేసే జగన్ రెడ్డి సర్వేరాళ్లను సైతం వదలకుండా వాటిపై తమ పేరు వేసుకున్నాడు. వాస్తవానికి ఆ పథకానికి జగనన్న భూభక్ష అని పేరు పెడితే కరెక్టుగా సరిపోయేది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బిసిలకు చెందిన పేదలు, ప్రభుత్వ భూములు, ఆలయాల భూములు గుర్తించి వాటిని కొట్టేయడానికి వేసిన మాస్టర్ ప్లాన్. ముందు సర్వే అంటారు, తర్వాత రాళ్లు అంటారు, చివరిగా ఈ భూమి మాదే అంటారు. కావాలంటే రాళ్లపై మా జలగన్న బొమ్మ ఉంది చూసుకోండని చెబుతారు. ఇటువంటి సర్వే రాళ్లే మీ అరాచక ప్రభుత్వానికి సమాధిరాళ్లు కాబోతున్నాయి... రాసి పెట్టుకో జగన్మోసపురెడ్డీ?!'' అంటూ రాసుకొచ్చారు.
ALSO READ: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఉద్యోగ భర్తీకి గ్రీన్ సిగ్నల్!