Vizag: ఉదయం వెళ్ళాల్సిన రైలు సాయంత్రానికి..వెయ్యి ఓట్లు గల్లంతు

విశాఖలో దాదాపు వెయ్యి మంది ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు. హైదరాబాద్ నుంచి ఓటు వేయడానికి వైజాగ్‌ బయలుదేరారు కానీ..ట్రైన్ ఆలస్యం అవడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకు కూర్చున్నారు.

New Update
Vizag: ఉదయం వెళ్ళాల్సిన రైలు సాయంత్రానికి..వెయ్యి ఓట్లు గల్లంతు

Vizag: మీరు వెళ్లాల్సిన రైలు జీవిత కాలం లేటు అని...నానుడి. కానీ ఇప్పుడదే నిజం అయింది. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాల్సిన రైలు ఒక రోజు లేటయింది. నాందేడ్ నుంచి వైజాగ్ వెళ్ళే ట్రైన్‌లో హైదరాబాద్ నుంచి చాలా మంది ఓటేయడానికి బయలు దేరారు. మామూలుగా అయితే ఈ ట్రైన్ ఉదయం తొమ్మది గంల లోపు విశాఖకు చేరుకోవాలి. కానీ ఇప్పుడు అది ఆలస్యం అయి సాయంత్రం 6.30కు చేరుకుంటోంది. దీంతో ఇందులో ఓటు వేయడానికి బయలు దేరిన వెయ్యి మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారు. దీని ప్రభావం వైజాగ్‌ మీద భారగీనే పడే అవకాశం ఉంది. విశాఖ పోలింగ్ శాతం తగ్గడమే కాక అభ్యర్థుల ఫలితాలలో కూడా మార్పులు చోటు చేసుకోవచ్చును.

Also Read:PITAPURAM: పిఠాపురంలో హైటెన్షన్‌.. రెచ్చిపోయిన వైసీపీ, జనసేన కార్యకర్తలు!

Advertisment
తాజా కథనాలు