గత కొంతకాలం వరకు కేవలం బాలీవుడ్ (Bollywood) కే పరిమితమైన నెట్ ఫ్లిక్స్ (Netflix) కన్ను ఇప్పుడు టాలీవుడ్ (Tollywood) మీద పడినట్లు తెలుస్తుంది. ఎందుకంటే నెట్‌ఫ్లిక్స్ సీఈవో వరుస పెట్టి టాలీవుడ్ బాడా హీరోలందరినీ కలుస్తున్నారు. గురువారం నగరానికి విచ్చేసిన నెట్ ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్ ముందుగా మెగా ఫ్యామిలీని (Mega family) కలవడానికి స్వయంగా వారి ఇంటికి వెళ్లగా..శుక్రవారం నాడు ఎన్టీఆర్ (Jr Ntr) తో భేటీ అయ్యారు.
దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఎన్టీఆర్ తో పాటు నెట్ ఫ్లిక్స్ సీఈవో టెడ్ ఆయన అన్నయ్య అయినటు వంటి నందమూరి కల్యాణ్ రామ్ ను కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. వీరితో పాటు కొరటాల శివ కూడా టెడ్ ను కలిసిన వారిలో ఉన్నారు.
టాలీవుడ్ తనదైన సినిమాలతో ప్రపంచం ముందుకు దూసుకుపోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఏడాది క్రితం విడుదలైన సినిమా పాన్ ఇండియా లెవల్ తో పాటు..అంతర్జాతీయంగానూ ప్రదర్శితమై ఆస్కార్ బరిలో నిలిచి..ఆస్కార్ ని పట్టుకుని వచ్చేసింది. ఈ క్రమంలోనే ప్రముఖుల దృష్టి తెలుగు ఇండస్ట్రీ మీద పడినట్లు తెలుస్తుంది.
ఆర్ఆర్‌ఆర్ కేవలం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ చిత్రం సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. దీని పై నెట్ ఫ్లిక్స్ సీఈవో 2022 లో మోస్ట్, బెస్ట్ రెవల్యూషనరీ సినిమా ఆర్‌ఆర్‌ఆర్ అని తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో పేర్కొన్న విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు స్వయంగా ఆయనే రంగంలోకి దిగి ఇలా మెగాస్టార్, నందమూరి ఫ్యామిలీలను కలవడం ఇండస్ట్రీలో పెద్ద టాపిక్ అయ్యింది. అటు మెగా ఫ్యామిలీతోనూ..ఇటు నందమూరి ఫ్యామిలితోనూ కూడా టెడ్ సినిమాల గురించి , ఓటీటీల గురించి చర్చించినట్లు సమాచారం.
ఎందుకు నెట్ ఫ్లిక్స్ సీఈఓ.. ఇలా టాలీవుడ్ స్టార్స్ ఫ్యామిలీస్ ను మీట్ అవుతున్నారు అనేది తెలియాల్సి ఉంది. అయితే నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ ఇలా టాలీవుడ్ ప్రముఖులను కలవడం చర్చానీయాంశంగా మారింది. అసలు ఆయనెందుకు టాలీవుడ్ ప్రముఖులను కలుస్తున్నారు అనే గుసగుసలు పరిశ్రమలో వినబడతున్నాయి.
ముఖ్యంగా చరణ్, ఎన్టీఆర్ ని కలవడంతో ఇండస్ట్రీలో వీరిద్దరితో కలిసి నెట్‌ఫ్లిక్స్ ఏదైనా ప్రాజెక్టు చేయబోతుందా అనే ప్రశ్నలు మొదలు అయ్యాయి. లేక వీరితో మామూలుగానే భేటీ అయ్యారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ నెట్‌ఫ్లిక్స్ సీఈవో నందమూరి ఫ్యామిలీని కలిసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Also read: అప్పటి వరకు ఉల్లి ఎగుమతులను నిషేదించిన భారత్!