లోక్‌సభ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్ తగిలింది. నాగర్‌కర్నూల్ బీఆర్‌ఎస్ ఎంపీ రాములు బీజేపీలో చేరనున్నారు. ఈ నెల 29న ఢిల్లీలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు. 2019లో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి నాగర్‌కర్నూల్ ఎంపీగా గెలిచిన రాములు.. గత కొద్ది రోజులుగా బీజేపీ నేతలతోనే టచ్‌లో ఉంటున్నారు. ఇటీవల జరిగిన నాగర్ కర్నూల్ సన్నాహక సమావేశానికి కూడా ఆయన హాజరుకాలేదు. కొంతకాలంగా రాములు బీఆర్‌ఎస్ పార్టీతో అసంతృప్తిగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈయన బీజేపీ నుంచి నాగర్‌కర్నూల్ ఎంపీగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి బీజేపీ అధిష్ఠానం రాములుకు టికెట్ ఇస్తుందో లేదో చూడాలి మరి.
బీజేపీ నుంచి ఎంపీగా పోటీ..!
నాగర్‌కర్నూల్ బీఆర్‌ఎస్ ఎంపీ రాములు బీజేపీలో చేరనున్నారు. ఈ నెల 29న ఢిల్లీలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు. 2019లో నాగర్‌కర్నూల్ ఎంపీగా గెలిచిన రాములు.. బీఆర్‌ఎస్‌తో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి ఆయన ఎంపీ పోటీ చేసే ఛాన్స్ ఉంది.
కొడుకు విషయంలో పార్టీపై అసంతృప్తి
అయితే రాములు కొడుకు భరత్ ప్రస్తుతం కల్వకుర్తి జడ్పీటీసీగా కూడా ఉన్నారు. అప్పట్లో భరత్‌ను జెడ్పీ ఛైర్మన్ గా చేసేందుకు రాములు ప్రయత్నాలు చేశారు. కానీ పార్టీలోని పలువురు నేతల నుంచి అభ్యంతరాలు రావటంతో.. అంతా రివర్స్ అయిపోయింది. అప్పట్నుంచి రాములు పార్టీపై అసంతృప్తిగానే ఉన్నారు. దీనికితోడు గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తన కొడుకు భరత్‌కు అచ్చంపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు కూడా ప్రయత్నాలు చేశారు. కానీ చివరికి అధిష్ఠానం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బాల్ రాజుకే టికెట్ ఇచ్చింది. దీంతో పార్టీ తీరుపై తీవ్రమైన అంసతృప్తితో ఉన్న రాములు.. గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు.
నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నిర్వహించిన పార్టీ సన్నాహక సమావేశంలో ఆయన కనిపించకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ సమావేశానికి వర్కింగ్ ప్రెసిడింట్ కేటీఆర్(KTR) కూడా హాజరయ్యారు. అయితే సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాములు కనిపించకపోవడంతో.. పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఆయన పార్టీ మారనున్నారనే వార్తలు జోరుగా ప్రచారమయ్యాయి. ఇక చివరికి ఆయన ఇప్పుడు బీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరనున్నారు.
Also Read: 2020 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై సర్కార్ కీలక నిర్ణయం