/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/mega-jpg.webp)
Varun-Lavanya Marriage: హీరో నితిన్ (Nithin), షాలిని దంపతులు ఇప్పటికే ఇటలీ చేరుకున్నారు. నితిన్ ఫోటో ఒకటి ఆల్రెడీ బయటకు వచ్చింది. అయితే, వాళ్లతో పాటు అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), సమంత (Samantha) కూడా పాల్గొంటారని సమాచారం. నాగచైతన్య ఇప్పటికే హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారని తెలుస్తోంది. ఇక సమంత నిన్న ముంబై ఎయిర్‌పోర్టులో మీడియా కంట పడ్డారు.
ఇక ఇటలీలో పెళ్ళి వేడుకల్లో మెగా ఫ్యామిలీ మొత్తం పాల్గొంది. పెళ్ళికి ముందు జరిగిన హల్దీ, మెహందీ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి-సురేఖ దంపతులు, నాగబాబు-పద్మజ దంపతులతో పాటు రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన, అల్లు అర్జున్ (Allu Arjun), స్నేహారెడ్డి, సాయిధరమ్ తేజ్, ఇతర మెగా అల్లు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అందరూ పసుపు రంగు దుస్తుల్లో మెరిసిపోయారు. సాయంత్రం మెహందీ ఫంక్షన్ కూడా జరిగింది. అలాగే సంగీత్ కార్యక్రమంలో కొణిదెల ఫ్యామిలీ డాన్సులతో సందడి చేసింది. ఒక ఈ రోజు మధ్యాహ్నం వరుణ్-లావణ్య పెళ్లి జరగనుంది. మధ్యాహ్నం 2.48 గంటలకు ముహూర్తం. రాత్రి 8.30 నుంచి రిసెప్షన్ ఉంటుంది.
Also Read: హీరోయిన్ గా బిగ్ బాస్ ఫేమ్ అలేఖ్య హారిక
ఈ పెళ్లి వేడుకలో మెగా, అల్లు కుటుంబ సభ్యులతో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందిన కొంత మంది అతిథులు హాజరు అవుతున్నారు. ఇప్పటికే హీరో నితిన్, ఆయన భార్య షాలిని ఇటలీ చేరుకున్నారు. ఇక అక్కినేని నాగచైతన్య, సమంత, రష్మిక మందన కూడా ఈ పెళ్లి వేడుకలో పాల్గొననున్నట్టు సమాచారం. వీరంతా హైదరాబాద్ నుంచి ఇప్పటికే బయలుదేరి వెళ్లారని సమాచారం. నాగచైతన్య, సమంత విడిపోయిన తరవాత ఒక ఫంక్షన్‌లో ఎదురెదురు పడుతుండడం ఇదే తొలిసారి. దీంతో అందరిలో ఒక రకమైన ఆసక్తి నెలకొంది. వీళ్ళు కలిసి ఉన్న ఫోటోలు బయటకు వస్తాయా లేదో చూడాలి అంటున్నారు. నాగచైతన్య, సమంత ఎదురెదురు పడితే వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారు అని చాలా మంది ఎదురుచూస్తున్నారు.
More glimpses into #VarunLav fairytale wedding 🎊💞
Witness the beautiful bond of @IAmVarunTej & @Itslavanya at their enchanting Mehendi ceremony! 🌸🎉
Tying the knot Today at 2.48 PM IST ✨ pic.twitter.com/tjyZo2aayM
— # Manoj (@manojvalluri) November 1, 2023