Naga Chaitanya Engagement : 8.8.8 అర్థం ఏంటి..? నాగచైతన్య, శోభిత నిశ్చితార్థం అక్కినేని నాగచైతన్య, నటి శోభిత నిశ్చితార్థం ఈరోజు ఉదయం 9:42 గంటలకు కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగింది. ఈ జంటకు నాగార్జున శుభాకాంక్షలు తెలుపుతూ..''8.8.8 అనంతమైన ప్రేమకు నాంది'' అని రాసుకొచ్చారు. 8.8.8 అర్ధమేంటో ఆర్టికల్ లో తెలుసుకోండి. By Archana 08 Aug 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Naga Chaitanya - Sobhita : టాలీవుడ్ (Tollywood) హీరో అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya), నటి శోభిత దూళిపాళ (Sobhita Dhulipala) త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈరోజు ఉదయం 9:42 గంటలకు వీరిద్దరి నిశ్చితార్థం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగింది. ఈ విషయాన్ని నాగ చైతన్య తండ్రి అక్కినేని నాగార్జున సోషల్ మీడియా (Social Media) వేదికగా ప్రకటిస్తూ.. నిశ్చితార్థ వేడుకల ఫొటోలను షేర్ చేశారు. నాగార్జున తన పోస్ట్ లో ఇలా రాసుకొచ్చారు.. "మా కొడుకు నాగ చైతన్య నిశ్చితార్థం శోభిత ధూళిపాళతో జరిగినట్లు తెలియజేయడం మాకు సంతోషంగా ఉంది. శోభితను మా కుటుంబంలోకి స్వాగతించేందుకు సంతోషిస్తున్నాము. సంతోషకరమైన జంటకు అభినందనలు. వారికి జీవితాంతం ప్రేమ, సంతోషం కలగాలని కోరుకుంటున్నాను. 8.8.8 అనంతమైన ప్రేమకు నాంది❤️"అని రాశారు. 8.8.8 అర్థం ఏంటి..? అయితే ఈ పోస్ట్ లో 8.8.8 అంటే ఏంటి అని అందరూ ఆసక్తిగా ఉన్నారు. మొదటి 8 ఈరోజు డేట్, రెండవ 8 ఈ నెలను సూచిస్తుంది. ఇక చివరి 8 ఏంటి అని ఆలోచిస్తున్నారు. 2024(2+0+2+4) కలిపితే 8 వస్తుంది. అలా లక్కీగా భావించి 8.8.8 అని పెట్టినట్లు తెలుస్తోంది. "We are delighted to announce the engagement of our son, Naga Chaitanya, to Sobhita Dhulipala, which took place this morning at 9:42 a.m.!! We are overjoyed to welcome her into our family. Congratulations to the happy couple! Wishing them a lifetime of love and happiness. 💐… pic.twitter.com/buiBGa52lD — Nagarjuna Akkineni (@iamnagarjuna) August 8, 2024 Also Read: Tollywood: మంచు మనోజ్, నాగ చైతన్యతో పాటు రెండో పెళ్లి చేసుకున్న సెలెబ్రెటీలు వీళ్ళే .. - Rtvlive.com #tollywood #akkineni-naga-chaitanya #sobhita-dhulipala #engagement మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి