Sheikh Hasina: బంగ్లాదేశ్ పరిస్థితులు అస్సలు ఏమీ బాగాలేవు. ఆందోళనలతో అట్టుడుకుతోంది. అల్లర్లు చేలరేగాయి. అల్లరి మూకలు ఆ దేశ ప్రధాని ఇంటిపై కూడా దాడి చేశాయి. ఈ పరిస్థితుల్లో భద్రతా కారణాల దృష్ట్యా...కుటం సభ్యుల ఒత్తిడి మేరకు ప్రధాని హసీనా తన పదవికి రాజీనామా చేయడమే కాకుండా..దేశం విడిచి కూడా వెళ్ళిపోయారు. నిన్నటి నుంచే షేక్ హసీనా రాజీనామా చేసే యోచనలో ఉన్నారని చెప్పారు ఆమె కుమారుడు సాజీబ్.
15 ఏళ్ళపాటూ అధికారంలో ఉన్న తన తల్లి ఎన్నో కష్టాలకు ఓర్చుకున్నారని..కానీ ఇప్పుడు ఇంక ఆమెకు ఓపిక లేదని షేక్ హసీనా కుమారుడు సాజీబ్ చెప్పారు. తాజా పరిణామాలు ఆమెను తీవ్ర నిరాశపరిచాయని తెలిపారు. అందుకే ఆమె మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ లేదని చెప్పారు. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న షెక్ హసీనా ఇక్కడ నుంచి లండన్ వెళ్ళనున్నారు.