Bangladesh: మా అమ్మ ఇంక రాజకీయాల్లోకి రారు.. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. దీంతో అక్కడ ప్రభుత్వాన్ని ఆర్మీ తమ స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో దేశం విడిచి వెళ్ళిపోయిన షేక్ హసీనా ఇక రాజకీయాల్లోకి తిరిగి రారని చెప్పారు ఆమె తనయుడు సాజీబ్ వాజెద్ జాయ్. By Manogna alamuru 06 Aug 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Sheikh Hasina: బంగ్లాదేశ్ పరిస్థితులు అస్సలు ఏమీ బాగాలేవు. ఆందోళనలతో అట్టుడుకుతోంది. అల్లర్లు చేలరేగాయి. అల్లరి మూకలు ఆ దేశ ప్రధాని ఇంటిపై కూడా దాడి చేశాయి. ఈ పరిస్థితుల్లో భద్రతా కారణాల దృష్ట్యా...కుటం సభ్యుల ఒత్తిడి మేరకు ప్రధాని హసీనా తన పదవికి రాజీనామా చేయడమే కాకుండా..దేశం విడిచి కూడా వెళ్ళిపోయారు. నిన్నటి నుంచే షేక్ హసీనా రాజీనామా చేసే యోచనలో ఉన్నారని చెప్పారు ఆమె కుమారుడు సాజీబ్. 15 ఏళ్ళపాటూ అధికారంలో ఉన్న తన తల్లి ఎన్నో కష్టాలకు ఓర్చుకున్నారని..కానీ ఇప్పుడు ఇంక ఆమెకు ఓపిక లేదని షేక్ హసీనా కుమారుడు సాజీబ్ చెప్పారు. తాజా పరిణామాలు ఆమెను తీవ్ర నిరాశపరిచాయని తెలిపారు. అందుకే ఆమె మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ లేదని చెప్పారు. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న షెక్ హసీనా ఇక్కడ నుంచి లండన్ వెళ్ళనున్నారు. Also Read:మద్యం మత్తులో నడిరోడ్డు మీద సచిన్ బెస్ట్ ఫ్రెండ్ #politics #sheikh-hasina #bangldesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి