Telangana Elections: ఇక నుంచి నా ఫోకస్ ఆ సీట్‌పైనే.. బండి సంజయ్ సంచలన కామెంట్స్.. ఎంపీగా ఉన్న బండి సంజయ్.. తదుపరి ఎన్నికల్లో మళ్లీ గెలిచేందుకు అవసరమైన వ్యూహ రచన చేస్తున్నారు. ఇంతకాలం.. ఆయన ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తారని భావించినా.. లేటెస్ట్‌గా ఆయన చేసిన కామెంట్స్ పోటీపై ఓ క్లారిటీని ఇచ్చాయి. ఇకపై ఆ నియోజకవర్గంపైనే ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. By Shiva.K 14 Sep 2023 in రాజకీయాలు కరీంనగర్ New Update షేర్ చేయండి Bandi Sanjay Kumar: తెలంగాణలో మరికొద్ది నెలల్లో ఎన్నికలు రానున్నాయి. దాంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఎన్నిలకపై(Telangana Elections) ఫోకస్ పెట్టాయి. ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ(BJP).. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. అధికార బీఆర్‌ఎస్(BRS) పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ నిత్యం ప్రజల్లో ఉండేలా ప్లాన్స్ చేస్తోంది. ఇక ఆ పార్టీ ముఖ్య నేతలు సైతం తాము పోటీ చేయాలని భావిస్తున్న నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ ఎంపీ స్థానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్.. తదుపరి ఎన్నికల్లో మళ్లీ గెలిచేందుకు అవసరమైన వ్యూహ రచన చేస్తున్నారు. ఇంతకాలం.. ఆయన ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తారని భావించగా.. ఆ ఊహాగానాలకు బలం చేకూరుస్తూ లేటెస్ట్‌గా ఆయన కామెంట్స్ చేశారు. తన పోటీపై ఓ క్లారిటీని ఇచ్చాయి. ఇకపై కరీంనగర్ నియోజకవర్గంపైనే ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. అందులో భాగంగానే ఎక్కువ సమయం ఈ నియోజకవర్గానికే కేటాయిస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ దమ్ము చూపిద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన ఆయన.. పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటామని అన్నారు. గురువారం మధ్యాహ్నం కరీంనగర్ లోని ఈఎన్ ఫంక్షన్ హాలులో బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని నేతలతో పార్టీ సంస్థాగత బలోపేతంపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండలాధ్యక్షులు, జిల్లా ఆఫీస్ బేరర్స్, జిల్లా ఇంఛార్జీలు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు సుద్దాల దేవయ్య, బొడిగె శోభ, జిల్లా ఇంఛార్జీ మీసాల చంద్రయ్య, మోహన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పాపారావు, జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు, బొమ్మ శ్రీరాం, ఎర్రం మహేశ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈనెల 17న తెలంగాణ విమోచన దినోత్సవంతోపాటు నరేంద్రమోదీ పుట్టిన రోజును పురస్కరించుకుని పార్టీ తరపున చేపట్టాల్సిన కార్యక్రమాలతోపాటు త్వరలో చేపట్టబోయే బస్ యాత్ర వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన బండి సంజయ్ కీలక కామెంట్స్ చేశారు. బండి సంజయ్ కామెంట్స్.. 'పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ రాష్ట్రమంతా తిరగాల్సి రావడంతో కరీంనగర్ పార్లమెంట్‌కు ఎక్కువ సమయం కేటాయించలేకపోయాను. ఇక నాకిప్పుడు ఏమీ పనిలేదు. నేను ఇక కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోనే ఉంటా. బీజేపీ దమ్మేందో చూపిస్తా. ఎక్కువ సమయం పార్లమెంట్‌కే కేటాయిస్తా. పార్టీ ఆదేశిస్తే కరీంనగర్ ఎమ్మెల్యే స్థానంతోపాటు ఎక్కడైనా పోటీ చేస్తా. ఇక నుండి మీరంతా టైమివ్వాలి. డబ్బు ఎన్నటికీ శాశ్వతం కాదు. డబ్బులకు ఆశపడితే జనం మనసులను గెలవలేరు. బ్లాక్ మెయిల్ చేసే రాజకీయాలకు వెరవను. త్యాగాలను వెనుకాడని జిల్లా ఇది. జమిలి ఎన్నికలొస్తాయా? అసెంబ్లీ ఎన్నికలొస్తాయా? అనే దానిపై సంబంధం లేకుండా నిరంతరం ప్రజల్లో ఉండాలి. ఇప్పుడు అధ్యక్ష పదవి లేదు కాబట్టి రాబోయే ఎన్నికల్లో గెలిచి కరీంనగర్ ప్రజల రుణం తీర్చుకుంటా. నాకు వేరే ఆశలేదు. నాకు లాబీయింగ్ చేతకాదు. నేనెవరనీ మోసం చేయను. ఎవరినైనా మోసం చేస్తే.. మన కుటుంబాలకు కూడా ఆ పాపం తగులుతుంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలను బీజేపీ గెల్చుకోవాలి. బీఆర్ఎస్‌పై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఊసే లేదు. ఇకపై ఎవరి నియోజకవర్గంలో వాళ్లు బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై యుద్దం చేయండి. ఇక్కడి బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. ఎంఐఎం నాయకులను తీసుకెళ్లి అసదుద్దీన్ ఒవైసీని కలిశారు. ఇలాంటోళ్లనా మనం గెలిపించేది? ప్రజలంతా ఆలోచించేలా చేయండి. ఇదే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లండి. నేను కాంప్రమైజ్ రాజకీయాలను చేయను. నేను నిజాయతీని నమ్ముకున్నా. కేసులకు భయపడను.' అంటూ పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు బండి సంజయ్. ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 16వ తేదీన బైక్ ర్యాలీల నిర్వహించాలని ఈ భేటీలో నిర్ణయించారు. తెలంగాణ పోరాట యోధుల చరిత్రను పుస్తకాల్లో పాఠ్యాంశంగా మార్చాలని డిమాండ్ చేశారు. పోరాట యోధుల ప్రాంతాలను స్మృతి కేంద్రాలగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 17వ తేదీన ఉదయం అన్ని పోలింగ్ కేంద్రాల్లో జాతీయ జెండాను ఎగరేయాలని పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేశారు బండి సంజయ్. అనంతరం హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే అమిత్ షా సభకు అందరూ హాజరుకావాలని కోరారు. ఇక ఈ నెల 17వ తేదీన విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు బండి సంజయ్. కేంద్రం విశ్వకర్మలకు ప్రకటించిన ప్యాకేజీని జనంలోకి తీసుకెళ్ళాలని సూచించారు. Also Read: Chandrababu Naidu Arrest: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై సంచలన వివరాలు వెల్లడించిన సీఐడీ చీఫ్.. #telangana-elections #bandi-sanjay-kumar #telangana-politics #bjp-mp #bandi-sanjay-comments #bjp-politics #karimnagar-bjp-mp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి