Telangana BJP: బండి సంజయ్ ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదా? తెలంగాణలో బీజేపీ నయా స్ట్రాటజీ..
బండి సంజయ్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేనట్లే కనిపిస్తోంది. పార్టీ అధిష్టానం ఆయనకు వేరే బాధ్యతలు అప్పగించింది. దాని ఫలితంగా ఎమ్మెల్యే క్యాండిడేట్‌గా బండి నిలబడతారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. దేశంలో తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలోనే పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్‌ను ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి స్టార్ క్యాంపెయినర్‌గా నియమించింది. దాంతో ఆయన ఆ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంటుంది.