Amit Shah : తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ పర్యటనలో ఉన్న అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేయడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లీస్ కుటుంబ పార్టీలను మండిపడ్డారు. ఆ మూడు అవినీతి పార్టీలే అని పేర్కొన్నారు.

New Update
Amit Shah : రిజర్వేషన్లు రద్దు... అమిత్ షా హాట్ కామెంట్స్

Amit Shah on Telangana Muslim Reservation: తెలంగాణ పర్యటనలో ఉన్న అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేయడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS), మజ్లీస్ కుటుంబ పార్టీలను మండిపడ్డారు. ఆ మూడు అవినీతి పార్టీలే అని పేర్కొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అవినీతి జాబితా పంపిస్తానని.. కాంగ్రెస్ అవినీతిపై జవాబు చెప్పిన తరువాతే బీజేపీ పై విమర్శలు చేయాలని అన్నారు.

తక్కువలో 12..

రానున్న లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections 2024) తెలంగాణలో 12 కంటే ఎక్కువ ఎంపీ స్థానాల్లో బీజేపీ విజయం సాదిస్తుందని అన్నారు అమిత్ షా. 10ఏళ్లలో మోడీ సర్కార్ అవినీతిని అంతం చేసిందని అన్నారు. దేశం సురక్షితంగా ఉంది అంటే కారణం మోడీ సర్కార్ అని... మోడీ (PM Modi) హయాంలో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతుందని వ్యాఖ్యానించారు.

ALSO READ: ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమిర్ అలీఖాన్

అది మా ఘనతే..

5 వందల ఏళ్ల కల నెలవెర్చిన ఘనత మోడీ సర్కార్ ది అని అన్నారు. గతంలో కాంగ్రెస్ సర్కార్ చేయని పని మోడీ చేసి చూపించాడని హర్షం వ్యక్తం చేశారు. ఆర్టికల్ (Article) 370 రద్దు చేసిన ఘనత మోడిదని... కాంగ్రెస్ పార్టీ దానిని రాజకీయం మాత్రమే చేసిందని మండిపడ్డారు. ట్రిపుల్ తలాక్ తీసివేసిన వ్యక్తి మోడీ అని.... మహిళ రిజర్వేషన్ కల్పించారని అన్నారు. CAA నిర్ణయం కూడా మోడీ సర్కార్ చేసిందని... కాంగ్రెస్ పార్టీ చేయని పనిని మోడీ సర్కార్ చేసి చూపించిందని అన్నారు అమిత్ షా. CAA నీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని అన్నారు.

ఆ మూడు పార్టీలు ఒకటే..

కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలఎజెండా ఒక్కటే.... మజ్లిస్ ఎజెండా లో మిగితా పార్టీలు నడుస్తాయని ఆరోపించారు అమిత్ షా. ఈ మూడు పార్టీలు మొత్తం కుటుంబ పార్టీలు.. అవినీతిలో మునిగిన పార్టీలను ఫైర్ అయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ని అడుగుతున్న కాంగ్రెస్ హయాంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయి...12లక్షల కోట్ల అవినీతి చేసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.

మోడీతోనే సాధ్యం...

తెలంగాణ అభివృద్ది మోడీతోనే సాధ్యం అని అన్నారు అమిత్ షా (Amit Shah). మోడీ జీవితం మొత్తం ప్రజల కోసమే పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ 2లక్షల కోట్లు ఖర్చు పెడితే.. ఒక్క తెలంగాణకు మోడీ 2లక్షల కోట్లకు పైగా ఖర్చు పెట్టారని అన్నారు. సర్జికల్ స్ట్రైక్ చేసి ఉగ్రవాదుల భరతం పట్టాడు మోడీ అని కొనియాడారు. ఇండియా కూటమి, బీఆర్ఎస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా బీజేపీ గెలుపును ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు.

Advertisment
తాజా కథనాలు