Thaman : గేమ్ చేంజర్, రాజా సాబ్ సినిమాలపై అదిరిపోయే అప్డేట్స్ ఇచ్చిన థమన్..!

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తాజాగా ఓ మ్యూజికల్‌ ఈవెంట్‌ కు హాజరయ్యారు. ఇందులో గేమ్ చేంజర్, రాజా సామ్ సినిమాల అప్డేట్స్ ఇచ్చారు. ఆగస్టు ఎండింగ్ నుంచి 'గేమ్ ఛేంజర్' అప్‌డేట్స్‌ ఇస్తామని, ప్రభాస్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కు తగ్గట్టుగా 'రాజా సాబ్' సంగీతం ఉంటుందని తెలిపారు.

New Update
Thaman : గేమ్ చేంజర్, రాజా సాబ్ సినిమాలపై అదిరిపోయే అప్డేట్స్ ఇచ్చిన థమన్..!

Music Director SS Thaman : ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ తన తాజా ప్రాజెక్టులైన 'గేమ్ ఛేంజర్' (Game Changer) , 'రాజా సాబ్' (Raja Saab) గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాజాగా హైదరాబాద్ లో నిర్వహించిన ఓ మ్యూజికల్‌ ఈవెంట్‌ కర్టెన్‌ రైజర్‌ ఈవెంట్‌కు దర్శకుడు మారుతితో కలిసి తమన్‌ హాజరయ్యారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ క్రమంలోనే 'గేమ్ ఛేంజర్', 'రాజా సాబ్' మూవీస్ పై అప్డేట్స్ ఇచ్చాడు.

మొత్తం ఏడు పాటలున్నాయి...

'గేమ్ ఛేంజర్' అప్‌డేట్‌ గురించి అడగ్గా.. ‘‘ఈ సినిమా క్రిస్మస్‌కు వస్తుందంటూ నిర్మాత దిల్‌ రాజు అందరికీ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఈ చిత్రంలో ఏడు పాటలున్నాయి. అవి ఎంతో అద్భుతంగా ఉన్నాయని, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయని చెప్పారు. ఆగస్టు చివరి నుండి సినిమా గురించి మరిన్ని అప్డేట్లు ఇవ్వాలని అనుకుంటున్నాం. ఇప్పటికే ‘జరగండి జరగండి’ సాంగ్‌ విడుదలైంది. అది నెట్టింట లీకైన సంగతి తెలిసిందే. ఈసారి లీక్‌ అవకముందే రెండో పాటను రిలీజ్‌ చేసేస్తాం’’ అని ఫన్నీగా సమాధానమిచ్చారు.

Also Read : రజినీకాంత్ కు విలన్ గా నాగార్జున.. ఊర మాస్ కాంబో సెట్ చేసిన డైరెక్టర్..!

ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ కు తగ్గట్లు...

'రాజా సాబ్' గురించి మాట్లాడుతూ.." కల్కి తో ప్రభాస్‌ (Prabhas) బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టారు. దీంతో, మాపై కాస్త ఒత్తిడి నెలకొంది. అయితే, ఇది కమర్షియల్‌ ఆల్బమ్‌ కావడం ఉపశమనం. ఇందులో డ్యాన్స్‌కు ప్రాధాన్యమున్న పాటలున్నాయి. ఆ విషయంలో మునుపటి ప్రభాస్‌ సర్‌ని చూస్తుండడం నాకు ఆనందంగా ఉంది.

ఈ సినిమాలోని పాటలు ఆడియన్స్ పల్స్ కు తగ్గట్లు గా ఉంటాయని, ప్రభాస్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కు తగ్గట్టుగా సంగీతం ఉంటుందని ఆయన తెలిపారు. తమన్ ఇచ్చిన అప్డేట్స్ తో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ రెండు సినిమాలు కూడా భారీ విజయాలు సాధిస్తాయనే నమ్మకం అభిమానులలో నెలకొంది.


Advertisment
తాజా కథనాలు