Mumbai : 40 ఏళ్ళ తర్వాత దొరికిన అత్యాచార నిందితుడు

అత్యాచారం చేశాడు...తరువాత హాయిగా తప్పించేసుకున్నాడు. చాలా ఏళ్ళ నుంచి ముంబాయి పోలీసులు ఇతన్ని వెతుకుతూనే ఉన్నారు. చిట్టచివరకు ఇప్పుడు 40 ఏళ్ళ తరువాత పాపా అలియాస్ దావూద్‌ను ముంబాయి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.

New Update
Mumbai : 40 ఏళ్ళ తర్వాత దొరికిన అత్యాచార నిందితుడు

40 Years Back Crime : ఇది 1984లో జరిగిన సంఘటన. ముంబాయికు చెందిన పాపా(Papa) అలియాస్ దావూద్(Dawood) ఒక మహిళను అత్యాచారం చేశాడు. అప్పటి నుంచి అతను పరారీలో ఉన్నాడు. 1985లో ఈ కేసు మీద ముంబాయి సెషన్స్‌ కోర్టులో విచారణ జరిగింది. దానికి దావూద్ హాజరు కాలేదు. దాంతో అతను పరారీలో ఉన్నట్టు జడ్జి ప్రకటించారు. నిందితుడిపై స్టాండింగ్‌ నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేశారు. అప్పటినుంచీ ఈ కేసు పెండింగులో ఉండిపోయింది. ఇప్పుడు ఇన్నాళ్ళకు మళ్ళీ ముంబాయి పోలీసులు(Mumbai Police) ఈ కేసు తిరగదోడారు.

ఎన్నికల పుణ్యమాని..
ప్రస్తుతం ఎన్నికల కోడ్‌(Election Code) అమలులో ఉన్నందున పాత రికార్డుల్లో పరారీలో ఉన్న నిందితులను గుర్తించి అరెస్టు చేసేందుకు ముంబయి డీసీపీ మోహిత్‌ కుమార్‌ గార్గ్‌ స్పెషల్‌డ్రైవ్‌ చేపట్టారు. ఈ క్రమంలో పాపా మీద ఉన్న కేసు బయటపడింది. నిందితుడిని ఇప్పటికైనా అరెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే దావూద్ ప్రస్తుతం ముంబాయిలో లేడు. తను ఉంటున్న ఇంటిని అమ్మేసి ఎటో వెళ్ళిపోయాడు. కానీ ముంబాయి పోలీసులు పట్టు వీడలేదు. దావూద్‌తో పరిచయ్, స్నేహం ఉన్న అందరినీ విచారించారు. ఇన్ఫార్మర్లను నియమించారు. అలా పాపా ఆగ్రాలో ఉంటున్నట్టు గుర్తించారు.

వెంటనే యాక్షన్...
ఆచూకీ తెలియడే ఆలస్యం పోలీసులు వెంటనే ఆగ్రా చేరుకున్నారు. దావూద్‌ను అరెస్ట్‌ చేసి ముంబాయి తీసుకువచ్చారు. అంతేకాదు వెంటనే కోర్టులో కూడా హాజరుపర్చారు. దీంతో 40 ఏళ్ళ తర్వాత ఈ కేసు విచారణ తిరిగి ఓపెన్ అయింది. అయితే ఇంకా విచారణ కొనసాగుతోంది. దీని మీద సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది.

Also Read:Salman khan: కాల్పుల కేసులో మరో నిందితుడు అరెస్ట్

Advertisment
Advertisment
తాజా కథనాలు