Mudragada: పవన్ నా అవసరం లేదా..? జనసేనానికి ముద్రగడ లేఖ! జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కాపు నేతల నుంచి లేఖలు అందుతున్నాయి. ముందు హరిరామ జోగయ్య లేఖ రాయగా.. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం పవన్ ను ఉద్దేశించి..మీ నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవు. ఎంతో మంది దగ్గర పర్మిషన్ తీసుకుని రావాలి..అంటూ ఎద్దేవా చేస్తూ పవన్ కు లేఖ రాశారు. By Bhavana 29 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి Mudragada Padmanabham Letter to Pawan: జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) కు కాపు నేతల నుంచి వరుస లేఖాస్త్రాలు వస్తున్నాయి. నిన్న హరిరామ జోగయ్య.. నేడు ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham)వరుస లేఖలు రాసి ప్రశ్నిస్తున్నారు. పవన్ కల్యాన్ కాకినాడలో పర్యటన చేసిన సమయంలో పలుమార్లు కిర్లంపూడిలోని మా ఇంటికి వస్తానని కబురు పంపి మరి రాలేదు. 2019 ముందు కవాతి చేసిన సమయంలో కూడా మా ఇంటికి వస్తానని చెప్పి రాలేదు. అయోధ్య వెళ్లి వచ్చిన తరువాత వస్తానని చెప్పి రాలేదు. ఇప్పటికి చాలా సార్లు మీ మనుషులతో కబురు పంపినప్పటికీ మీరు మాత్రం రాలేదు. మీ నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవు. ఎంతో మంది దగ్గర పర్మిషన్ తీసుకుని రావాలి. మీ పార్టీ పోటీ చేసే 24 మంది కోసం నా అవసరం రాదు...రాకూడదని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. నాకు ఎటువంటి కోరికలు లేకుండా నిస్వార్థంగా మీతో పాటు పని చేసేందుకు నేను సిద్ధపడ్డాను...రాష్ట్ర ప్రయోజనాల కోసం నా గతం, నా అవమానాలు, నా బాధలు, ఆశయాలు, కోరికలు అన్ని మరిచిపోయి మీతో పని చేసేందుకు సిద్దమయ్యాను. మీలాగా నేను గ్లామర్ ఉన్న వారిని పరపతి ఉన్న వాడిని కాదు తుప్పుపెట్టిన ఇనుము లాంటివాడిని అందుకే నన్ను లాస్ట్ గ్రేట్ లో పెట్టారు..అంటూ ముద్రగడ పవన్ కు ఘాటుగా లేఖ రాశారు. అంతకు ముందే హరిరామ జోగయ్య (Harirama Jogaiah) కూడా పవన్ కు లేఖ రాశారు. తెలుగుదేశం జనసేన బాగు కోరి నేనిచ్చే సలహా అధినేతలు ఇద్దరికీ నచ్చినట్లు లేదు. అది వారి ఖర్మ ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు అంటూ ఆ లేఖలో హరిరామ జోగయ్య పేర్కొన్నారు. Also Read: రేణుకా చౌదరి ముఖ్య అనుచరుడి పై కత్తితో దాడి..పరిస్థితి విషమం! #pawan-kalyan #tdp #chandrababu #ap-politics #janasena #mudragada-padmanabham మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి