PMMY: కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. వారికి రూ.20 లక్షల లోన్!

2024-25 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం.. ముద్రా యోజన పథకం కింద ఇచ్చే రుణాన్ని రూ.20 లక్షలకు పెంచింది. దీంతో చిరు వ్యాపారులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహ సంస్థలకు మరింత ప్రయోజనం చేకూరనుంది. లోన్ పొందాలనుకునే వారు mudra.org.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

New Update
PMMY: కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. వారికి రూ.20 లక్షల లోన్!

కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలనుకునేవారికి కేంద్రం ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. చిరు వ్యాపారులు, సూక్ష్మ, చిన్నతరహ సంస్థలకు రుణాలు అందించాలనే లక్ష్యంతో మోదీ సర్కార్ ఈ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా అర్హత ఉన్న వ్యక్తులు ఎలాంటి పూచికత్తూ లేకుండా రూ.10 లక్షల వరకు లోన్‌ పొందొచ్చు. అయితే 2024-25 ఆర్థిక సంవత్సకం బడ్జెట్‌లో కేంద్రం ఈ లోన్‌ పరిమితిని రెట్టింపు చేసింది. దీంతో ఇప్పుడు ముద్రా యోజన పథకం కింద రూ.20 లక్షల వరకు పూచికత్తు లేని రుణాలు పొందవచ్చు.

ప్రజల్లో స్వయం ఉపాధిని ప్రోతహించాలనే లక్ష్యంతో 2015 ఏప్రిల్ 8న ప్రధాని మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద కార్పొరేట్, వ్యవసాయేతర ప్రయోజనాల కోసం రుణాలు అందిస్తారు. నిరుద్యోగులు, సొంతంగా వ్యాపారం చేయాలనుకునే యువకులు అలాగే తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించాలనుకునే చిన్న వ్యాపారవేత్తలు ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు. అయితే ఈ స్కీమ్ కింద మూడు రకాల లోన్లు అందజేస్తారు. మొదటిది శిశు లోన్. ఇందులో దరఖాస్తుదారులు రూ.50 వేల వరకు లోన్ పొందవచ్చు. ఆ తర్వాత కిషోర్ విభాగం కింద రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు లోన్ లభిస్తుంది. ఇక చివరిగా తరుణ్‌ లోన్‌ కింద రూ. 5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు రుణం పొందవచ్చు.

Also Read: నేడు దేశవ్యాప్తంగా వైద్య సేవల నిలిపివేత…ఎందుకంటే!

ఈ స్కీమ్ కింద లోన్ పొందేందుకు దరఖాస్తుదారుడు ముందుగా వ్యాపార ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఇందుకు అవసరమైన అన్ని డాక్యుమెంట్లు బ్యాంకుకు ఇవ్వాలి. బ్యాంక్‌ బిజినెస్‌ ప్లాన్, ప్రాజెక్టు రిపోర్ట్ తదితర అవసరమైన డాక్యుమెంట్లు ఇవ్వాల్సి ఉంటుంది. లోన్ కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి భారత పౌరుడై ఉండాలి. వాళ్లు బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ డిఫాల్టర్‌ కాకూడదు.అలాగే మంచి క్రెడిట్ హిస్టరీ కూడా అవసరం. ముద్రా లోన్‌ ద్వారా చేయాల్సిన బిజినెస్.. కార్పొరేట్ సంస్థది కాకూడదు. దీనికి దరఖాస్తు చేసుకునే వ్యక్తికి 18 ఏళ్లు దాటి ఉండాలి.

మరో విషయం ఏంటంటే ఈ రుణాలు పొందడానికి ఎలాంటి ఆస్తులు తనఖా పెట్టాల్సిన పని లేదు. అలాగే ప్రాసెసింగ్ ఫీజులు ఉండవు. ఈ స్కీమ్ కింద లోన్‌ రిపేమెంట్ వ్యవధి 12 నెలల నుంచి 5 ఏళ్ల వరకు ఉంటుంది. ఈ మొత్తాన్ని ఐదేళ్లలో తిరిగి చెల్లించకపోతే.. మరో ఐదేళ్ల పాటు పొడిగించుకోవచ్చు. అలాగే లోన్ కింద మంజూరైన మొత్తానికి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. ముద్రా కార్టు ద్వారా విత్‌డ్రా చేసి ఖర్చు చేసిన మొత్తానికి మాత్రమే వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. పార్ట్‌నర్‌షిప్ వ్యాపారం చేస్తున్నా కూడా, ముద్రా యోజన ద్వారా రుణం తీసుకోవచ్చు.

Also Read: భారత్‌ను కించపరిచిన పాకిస్థానీ.. బుద్ధి చెప్పిన క్యాబ్ డ్రైవర్

ముందుగా ముద్రా యోజన mudra.org.in అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. శిశు, కిషోర్, తరుణ్ ఇలా మూడు రకాల రుణాలు ఉండే హోమ్‌ పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు అవసరమైన కేటగిరీని ఎంచుకోండి. ఆ తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి. అప్లికేషన్ ఫామ్‌లో వివరాలు నింపాలి. ఆధార్, పాన్, అడ్రస్, బిజినెస్ అడ్రస్ ప్రూఫ్,ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్స్‌ తదితర డాక్యుమెంట్స్ కాపీలను అటాచ్ చేయాలి. ఈ ఫామ్‌ను సమీపంలోని బ్యాంకులో అందజేయాలి. బ్యాంక్ మీ అప్లికేషన్‌ను వెరిఫై చేస్తుంది. మీకు అర్హత ఉన్నట్లు నిర్ధారణ అయితే నెలరోజుల్లోపు డబ్బులు మంజూరు అవుతాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు