Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు నారా భువనేశ్వరి భారీ విరాళం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వరద బాధితులకు సీఎం చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి భారీ విరాళాన్ని ప్రకటించారు. రెండు రాష్ట్రాలకు కోటి చొప్పున రెండు కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేశారు.

New Update
Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు నారా భువనేశ్వరి భారీ విరాళం

Nara Bhuvaneswari: భారీ వర్షాలు..దానికి తోడు వాగులు, వంకలూ పొంగి పొర్లడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాతాల్లో ప్రజలు జలదిగ్భంధంలో చిక్కుకుపోయి విలవిలలాడుతున్నారు. వీరికి సహాయం చేసేందుకు ఇప్పటికే చాలా మంది ముందుకు వచ్చారు. తెలుగు సినిమా హీరోలు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ప్రభుత్వం కూడ సహాయక చర్యలు చేస్తోంది. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రెండు కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. హెరిటేజ్‌ ఫుడ్స్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అయిన ఈమె హెరిటేజ్‌ ఫుడ్స్‌ సంస్థ తరఫున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.కోటి చొప్పున ఇస్తానని అనౌన్స్ చేశారు.

కష్టాలు వచ్చినప్పుడు ప్రజలకు అండగా నిలబడాలి. తెలంగాణ, ఆంధ్రాల్లో వచ్చిన వరదలు చాలా మంది మీద ప్రభావం చూపించాయి. నీటిలో చిక్కుకుపోయిఎంతో మంది కష్టాలు పడుతున్నారు. సంక్షోభంలో బాధితులకు అండగా ఉండడమే మనం చేయాలి. బాధిత ప్రాంతాలు, ప్రజలకు అందించే సహకారంలో మేం చేసిన ఈ సాయం వారి జీవితాలపై ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నాం..అందుకే సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాన్ని ప్రకటించామని భువనేశ్వరి చెప్పారు. వరద ప్రాంతాల్లో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలకు మా పూర్తి మద్దతు ఉంటుందని ఆమె తెలిపారు.

publive-image

Also Read: Kerala: మలయాళ నివిన్ పౌలిపై సెక్సువల్ అబ్యూజ్ కేసు

Advertisment
తాజా కథనాలు