2023 Movies: ఈ ఏడాది పెద్ద హీరోల సినిమాలు తక్కువే.. వాటికి బాక్సాఫీస్ సందడి కరువే 

పెద్ద హీరోల సినిమాలు విడుదలైతే బాక్సాఫీస్ దగ్గర ఉండే సందడే వేరు. థియేటర్ల వద్ద పండగ వాతావరణంతో హంగామా పోతుంది. ఈ ఏడాది పెద్ద హీరోల సినిమాలు చాలా తక్కువ వచ్చాయి. వచ్చిన వాటిలో ఒక్క బాలకృష్ణ  తప్ప ఏ హీరో పూర్తి స్థాయిలో హిట్స్ కొట్టలేదు.  

2023 Movies: ఈ ఏడాది పెద్ద హీరోల సినిమాలు తక్కువే.. వాటికి బాక్సాఫీస్ సందడి కరువే 
New Update

2023 Tollywood Movies: మన సినిమా అంటేనే హీరోయిజం. క్లాస్.. మాస్ అని రెండురకాలుగా విభజన చేసి సినిమాల గురించి మాట్లాడతారు. కానీ, రెండింటిలోనూ ఎక్కువ హీరోయిజం కనిపించాల్సిందే. అంటే ఎక్కువ సినిమాలు హీరో చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఇక టాలీవుడ్ లో పెద్ద హీరోల సినిమాలకు ఉండే క్రేజే వేరు. సినిమాలో ఈ హీరోలను ఏ మాత్రం కాస్త తక్కువ చేసినా ప్రేక్షకులు ఊరుకునే ప్రసక్తి ఉండదు. ఇక అభిమానుల సంగతైతే చెప్పక్కర్లేదు. గతంలో సంవత్సరానికి కనీసం నాలుగైదు సినిమాల్లో కనిపించేవారు పెద్ద హీరోలు. తరువాత ఒకటి రెండుకు పరిమితం అయిపోయారు. ఈ మధ్య అయితే.. రెండేళ్లకు ఒక సినిమా చేస్తున్నారు చాలామంది పెద్ద హీరోలు.

పెద్ద హీరోల సినిమా అంతే ఆ రేంజి బిల్డప్ కావాలి.. బడ్జెట్ ఉండాలి.. అదే రేంజ్ కాస్టింగ్ ఉండాలి. ఎలివేషన్స్ ఉండాలి. దీంతో సినిమాలు ఏళ్లకు ఏళ్ళు షూటింగ్ ల్లోనే ఉండిపోవడం ఈ మధ్య ఎక్కువగా జరుగుతోంది. పెద్ద హీరో సినిమాలంటే భారీ ఓపెనింగ్స్ గ్యారెంటీ. అందుకే ఎంత ఖర్చయినా నిర్మాతలు.. వెనుకాడరు. దర్శకులు కూడా జాగ్రత్తగా చేయాలనీ చూస్తారు. పెద్ద హీరోల సినిమాలు విడుదలైతే పండగ వాతావరణమే ఉంటుంది. ఇంత హంగామాలో రిలీజ్ అయిన పెద్ద హీరోల సినిమాలు హీరోని చూసి నిలబడిపోతాయాని అనుకుంటే తప్పే. రిలీజ్ వరకూ పెద్ద హీరో.. ఏదైనా తేడా కొట్టిందా నెక్స్ట్ వీక్ సినిమా ఖాళీ!

ఈ సంవత్సరం టాలీవుడ్ లో పెద్ద హీరోల హంగామా ఎలా ఉందొ ఓ లుక్కేద్దాం. జనవరి నెల అంటే సినిమాలకు పెద్ద సీజన్. సంక్రాంతి పండక్కి ప్రతి హీరో కూడా వచ్చేయాలని అనుకుంటాడు. ఇది ఎప్పటి నుంచో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితి. ఈ ఏడాది కూడా జనవరిలో సంక్రాతి టార్గెట్ గా భారీ చిత్రాలతో మన పెద్ద హీరోలు దిగిపోయారు. మొదట బాలకృష్ణ వీరసింహారెడ్డి అంటూ జనవరి 12న స్క్రీన్స్ ఆక్యుపై చేశాడు. మాస్ మాసాలతో వచ్చిన బాలయ్య అభిమానులతో విజిల్స్  వేయించాడు. భారీ ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ దగ్గర హంగామా చేశాడు. ఆ తరువాత బాలకృష్ణ (Balakrishna) రెండో సినిమా దసరాకి వచ్చింది. భగవంత్ కేసరి సినిమాతో సాలిడ్ హిట్ పట్టేశాడు. ఈ ఏడాది రెండు సినిమాలనూ హిట్ ఖాతాలో వేసుకుని ఊపులో ఉన్నాడు బాలయ్య బాబు. 

publive-image

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi).. కూడా ఈ ఏడాది  రెండు సినిమాలతో వచ్చాడు. సంక్రాంతికి వాల్తేరు వీరయ్యగా వచ్చి మంచి హిట్ అందుకున్నాడు. తరువాత చాలా అంచనాలతో వచ్చిన బోళా శంకర్ బోల్తా కొట్టింది. మిశ్రమ ఫలితాలతో నిరాశలో ఉన్న చిరంజీవి వచ్చే ఏడాది విశ్వంభరగా రావడానికి రెడీ అయిపోతున్నాడు. 

Waltair Veerayya

ఇక పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒకవైపు రాజకీయాల్లోనూ.. మరోవైపు సినిమాల్లోనూ చాలా బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది  చాలా సినిమాలు సెట్స్ మీద ఉన్నప్పటికీ.. ఒక్క సినిమా మాత్రమే విడుదలైంది. బ్రో సినిమాతో మేనల్లుడిని వేసుకుని వచ్చినా.. ఇది అనుకున్నంతగా వసూళ్లు రాబట్టడంలో విఫలం అయిందనే చెప్పాలి. ఇప్పుడు పవన్ మూడు సినిమాలు  సెట్స్ మీద జోరుగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. 

2023 Tollywood Movies

Also Read:  పవన్ తో బిగ్ బాస్ బ్యూటీ ఎంగేజ్మెంట్.. పిక్స్ వైరల్!

హిట్టూ.. ఫట్టూ అనే తేడాలేకుండా వరుసగా సినిమాలు చేస్తూ పోతున్నాడు రవితేజ. ఈ ఏడాది మూడు సినిమాలు రవితేజవి విడుదల అయ్యాయి. వాటిలో చిరంజీవితో కలిసి వచ్చిన వాల్తేరు వీరయ్య ఒకటే హిట్ గా నిలిచింది. సోలోగా వచ్చిన రావణాసుర, టైగర్ నాగేశ్వర్ రావును ప్రేక్షకులు పక్కన పెట్టేశారు. 

పాన్ ఇండియా లెవల్లో ఒక రేంజ్ ఉన్న హీరో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas). భారీ సినిమాల హీరోగా నిలబడిపోయిన ప్రభాస్ నుంచి ఈ ఏడాది ఆదిపురుష్ వచ్చింది. అయితే, ఈ సినిమా బోల్తా కొట్టడమే కాకుండా.. ప్రేక్షకులను పూర్తిగా నిరాశలో ముంచేసింది. సినిమా మీద వివాదాలు కూడా బోలెడు వచ్చాయి. ఇటువంటి సినిమాలో ప్రభాస్ ఎందుకు చేశాడా అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు ప్రభాస్ సలార్ సినిమా ఈనెల 22న  విడుదల కానుంది. ఇది కూడా అతి భారీ చిత్రమే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సలార్ విదేశాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ లో దూసుకుపోతోంది. ఈ సినిమాతో ప్రభాస్ హిట్ కొడతాడని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. 

Adipurush 2023 Tollywood Movies

ఇక హీరోలు నాగార్జున, వెంకటేష్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎన్ఠీఆర్, రామ్ చరణ్ వీళ్ళ సినిమాలు ఒక్కటీ కూడా విడుదల కాలేదు. 

Watch this interesting Video

#tollywood #prabhas #balakrishna #pawan-kalyan #chiranjeevi #year-end-review-2023
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe