Cricket: రికార్డ్‌లలో మాకు సాటే లేదంటున్న రోహిత్, బుమ్రా

ఐసీసీ నాకౌట్ టోర్నమెంటుల్లో రోహిత్ శర్మ, బుమ్రాలు రికార్డ్‌ల్లో దూసకుపోతున్నారు. 50 కంటే ఎక్కువ స్కోరు చేసిన వారిలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ రెండవస్థానంలో ఉండగా..అత్యధక వికెట్లు తీసిన లిస్ట్‌లో బుమ్రా 9 వికెట్లతో 8వ స్థానంలో ఉన్నాడు.

New Update
Cricket: రికార్డ్‌లలో మాకు సాటే లేదంటున్న రోహిత్, బుమ్రా

Rohith, Bumrah: ఓటమే లేకుండా ఆ రెండు జట్లు ఫైనల్‌కు దూసుకొచ్చాయి. ఒక జట్టేమో సుదీర్ఘ నిరీక్షణకు తెరిదించాలని కసి మీద ఉంటే.. తొలిసారి టైటిల్‌ ముద్దాడాలని మరో జట్టు పట్టుదలగా ఉంది. రెండూ జట్టూ ఫైనల్ పోరు కోసం పోటీపోటీగా బరిలోకి దిగుతున్నాయి. అయితే ఇండియా జట్టు చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ప్రస్తుతం ఉన్న ఆటగాళ్ళు అన్ని విభాగాల్లో బలంగా ఉన్నారు. రికార్డుల పరంగా కూడా దూసుకుపోతున్నారు. బ్యాటర్లలో రోహిత్ శర్మ, బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రాలను తదన్నేవాడే లేడన్నట్టుగా చెలరేగిపోతున్నారు. రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు.

పొట్టి ఫార్మాట్‌లో 50 కంటే ఎక్కువ స్కోరు సాధించినవారు..

ఐసీసీ నిర్వహించిన టోర్నమెంటుల్లో 50 కన్న ఎక్కువ స్కోరు సాధించిన వారిలో టీమ్ ఇండియా కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ముందంజలో ఉన్నాడు. లిస్ట్‌లో రోహిత్ రెండ స్థానంలో ఉన్నాడు. 5౦ కన్నా ఎక్కువ పరుగులు చేసిన వారిలో మొదటి స్థానంలో ఆస్ట్రేలియా క్రికెటర్ క్రిస్ గేల్ ఉండగా..రెండవ స్థానంలో రహిత్ శర్మ ఉన్నాడు. క్రిస్ గేల్ 7సార్లు, రోహిత్ 5సార్లు 50ప్లస్ స్కోర్లు సాధించారు. వీరి తర్వాత కోహ్లీ ౩సార్లతో యువరాజ్‌ సింగ్‌తో సమానంగా ఉన్నాడు.

అత్యధిక వికెట్లు...

ఐసీసీ టోర్నమెంట్లలో అత్యధిక వికెట్లు తీసిన వారిలో భారత క్రికెటర్లు చాలామందే ఉన్నారు. ఈ లిస్ట్‌లో అందరి కన్నా జహీర్‌ ఖాన్ 17 వికెట్లతో మొదటి స్థానంలో ఉంటే...తరువాి స్థానాల్లో సచిన్, రవి అశ్విన్, హర్భజన్, అనిల్ కుంబ్లే, షమీ, వెంకటేశ్ ప్రసాద్‌, జస్ప్రీత్ బుమ్రాలున్నారు. ప్రస్తుతం జరుగుతున్న టీ 20 వరల్డ్‌కప్‌లో బుమ్రా ఆడుతున్నాడు. అంతేకాదు అద్భుతంగా బౌలింగ్ కూడా చేస్తున్నాడు. ప్రతీ మ్యాచ్‌లో మూడుకు తగ్గకుండా వికెట్లు తీస్తూ దూసుకుపోతున్నాడు. చివరి మ్యాచ్‌లో కూడా బుమ్రా తన మ్యాజిక్‌ చేస్తాడని అందరూ భావిస్తున్నారు. రోహిత్, బుమ్రాలు ఇదే ఫామ్‌ను కొనసాగిస్తూ ఆడితే కనుక దక్షిణాఫ్రికాను ఓడించడం అంత పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పటికే టైటిల్ ఫేవరెట్ జట్టుగా భారత్ ఉంది. మన ఆటగాళ్ళు మరి కొంచెం ఎఫెర్ట్ పెడితే 11 ఏళ్ళ కల నెరవేరడం ఏమంత కష్టం కాదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు