Abhaya Hastham : మహాలక్ష్మి పథకానికే జైకొట్టిన మహిళలు.. దానికే ఎక్కువ దరఖాస్తులు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన అభయహస్తం దరఖాస్తుల లెక్కలు బయటకు వచ్చాయి. వీటిల్లో అన్నింటికన్నా మహాలక్ష్మి పథకానికే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,25,84,383 దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. By Manogna alamuru 20 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి 6 Guarantees : ఆరు గ్యారంటీలకు అభయహస్తం దరఖాస్తులు(Abhaya Hastham Applications) అంటూ తెలంగాణ గవర్నమెంట్(Telangana Government) ప్రాజెక్టు చేపట్టింది. అర్హులందరూ దరఖాస్తులు పెట్టుకోవాలని పిలుపునిచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన అభయ హస్తం పథకాలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. ప్రజా పాలన(Praja Palana) కార్యక్రమంలో తమ దరఖాస్తులను సమర్పించారు. వార్డు, గ్రామ, మండల ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాపాలన దరఖాస్తులను తీసుకుని, అప్లై చేసుకున్నారు తెలంగాణ ప్రజలు. ప్రస్తుతం వీటా డాటా ఎంట్రీ పనులు జరుగుతున్నాయి. ఇందులో బాగంగా అసలు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి... దేనికి ఎక్కువగా ప్రజలు అర్జీలు పెట్టుకున్నారు లాంటి వివరాలు బయటకు వచ్చాయి. Also read:థేమ్స్ నదిలా మూసీనది..సీఎం రేవంత్ రెడ్డి విజన్ 2050 ప్లాన్ మహాలక్ష్మికే ఎక్కువ... అభయహస్తం గ్యారంటీలతో పాటు ఇతర సంక్షేమ పథకాలకు అర్జీలు పెట్టుకున్నారు తెలంగాణ వాసులు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,25,84,383 దరఖాస్తులు వచ్చాయి. అందులో గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) నుంచి అత్యధికంగా 18.97లక్షల అప్లికేషన్స్ వస్తే... అత్యల్పంగా భూపాలపల్లి జిల్లా నుంచి 1.37లక్షల దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా మహాలక్ష్మి పథకానికే మహిళలు జైకొట్టారని తెలిపారు. ఆరు గ్యారంటీల్లో మహాలక్ష్మి పథకానికే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. మహాలక్ష్మి కింద మహిళలకు నెలకు రూ.2,500 పథకానికి..92,23,195 దరఖాస్తులు వచ్చాయి. తరువాతి స్థానం గ్యాస్ సిలిండెర్లదే.. మహాలక్ష్మి పథకం(Mahalakshmi Scheme) తర్వాత రూ.500కే గ్యాస్ సిలిండర్ల పథకానికి ఎక్కువ దరఖాస్తు చేస్తున్నారు తెలంగాణ వాసులు. రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకానికి మొత్తం 91,49,838 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఇక మూవడ స్థానంలో ఇందిరమ్మ ఇళ్ళు పథకం ఉంది. తీ పథకానికి తాము అర్హులమంటూ 82,82,332 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక 200యూనిట్ల ఫ్రీ కరెంట్ (గృహజ్యోతి) పథకానికి 81,54,158 , రైతు భరోసా (భూమి ఉన్న రైతులకు రూ.15వేలు)కు 38,73,956 , రైతు భరోసా (కౌలు రైతులకు) 2,63,616, రైతు కూలీలకు రూ.12 వేలుకు 40,95,581 దరఖాస్తులు వచ్చాయి. మిగిలిన పథకాలకూ దరఖాస్తులు... అభయహస్తంలోని ఆరు గ్యారెంటీ(6 Guarantees) లతో పాటూ మిగిలిన పథకాలకూ అర్జీలు పెట్టుకున్నారు జనం. ఇందులో ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు 250గజాల స్థలం పథకం కోసం 23,794 మంది, ఉద్యమకారులకు 250గజాల స్థలం కోసం 84,659 మంది, దివ్యాంగుల పెన్షన్ల పథకం కోసం 2,77,292 మంది, ఇతర పెన్షన్లు కోసం 22,07,245 మంది దరఖాస్తు చేసుకున్నారిని అధికారులు చెబుతున్నారు. డేటా ఎంట్రీ... ఈ నెల 17లోపున అభయహస్తం దరఖాస్తు డేటా ఎంట్రీ(Data Entry) పూర్తవ్వాలని అంతకు ముందే తెలంగాణ సీఎస్ శాంతకుమారి(CS Santha Kumari) ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియను మండల కేంద్రాల్లో జరిగింది. మండల రెవిన్యూ అధికారులు, మండల డెవలప్ మెంట్ అధికారులు, జాపాలన కార్యక్రమం సూపర్వైజరీ అధికారిగా ఉన్న జిల్లా స్థాయి అధికారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ డాటా ఎంట్రీ కార్యక్రమం మొత్తం జరిగింది. Also Read : Sita Rama Project : సీతారామ ప్రాజెక్టులోనూ మేఘా కృష్ణారెడ్డి భారీ దోపిడి #telanagna #cm-revanth-reddy #mahalaxmi-scheme #abhaya-hastham #6-guarantees మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి