CM Revanth Reddy:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ నుంచి నేరుగా లండన్ వెళ్ళిపోయారు. అక్కడ థేమ్స్ నది, ఆ నది ప్రవహిస్తున్నతీరు, దాని చుట్టూ నగరం అభివృద్ధి, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుల గురించి రీసెర్చ్ చేస్తున్నారు. అక్కడ అధికారులతో చర్చలు చేస్తున్నారు. థేమ్స్ రివర్ పాలక మండలి, పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ అధికారులు, నిపుణులతో దాదాపు మూడు గంటల పాటు చర్చలు జరిపారు. రేవంత్ రెడ్డి ఇవన్నీ చేయడానికి కారణం ఆయన హైదరాబాద్ మధ్యలో ఉన్న మూసీ నది మీద ఫోకస్ పెట్టడమే. థేమ్స్ నదిలానే మూసీ నది కూడా హైదరాబాద్ నగరం మధ్య నుంచి ప్రవహిస్తుంది. కనిపించడానికి డ్రైనేజిలా ఉన్నా అది కూడా నదే. ఇప్పుడు దాన్నే సీఎం రేవంత్ మొత్తం మార్చేయాలనుకుంటున్నారు.
పూర్తిగా చదవండి..Telangana CM:థేమ్స్ నదిలా మూసీనది..సీఎం రేవంత్ రెడ్డి విజన్ 2050 ప్లాన్
హైదరాబాద్ పడిబొడ్డున ఉన్న మూసీ నది డెవలప్‌మెంట్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుం బిగించారు. లండన్ థేమ్స్ నదిలా మూసీనదిని చేయాలని భావిస్తున్నారు. దావోస్ తర్వాత లండన్ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి థేమ్స్ నది గురించి, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుల గురించి తెలుసుకుంటున్నారు.
Translate this News: