Mosquitoe Tornado: దోమల టోర్నడో.. షాకింగ్‌ వీడియో!

పూణే ప్రాంత వాసులను ముస్కిటో టోర్నడో భయపెడుతుంది. దీంతో వారంతా నిద్రలేని రాత్రులను గడపాల్సిన పరిస్థితి దాపరిచింది. ముఠా నది మీదుగా లక్షలాది దోమల గుంపు పూణె నగరంలోని ప్రవేశించాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

Mosquitoe Tornado: దోమల టోర్నడో.. షాకింగ్‌ వీడియో!
New Update

Mosquitoes Tornado in Pune : ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా వింత ఘటనలు కనిపిస్తున్నాయి. ఈ మధ్య మిడతల దాడి దృశ్యాలు చూశాం. తాజాగా దోమల టోర్నడో వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. భారత వైమానిక దళానికి చెందిన లెఫ్టినెంట్ వీరేందర్ సింగ్ విర్ది(Virendra Singh Virdhi)  ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌(Instagram) లో షేర్ చేశాడు. పూణేలోని కేశవనగర్, ఖరాడి ప్రాంతాల్లో ఈ దోమల టోర్నడో(Mosquitoes Tornado) కనిపించింది.


పెద్ద సంఖ్యలో దోమలు గుంపులుగా ఆకాశంలో ఎగురుతూ కనిపించాయి. నివాస ప్రాంతాలలో దోమలు విపరీతంగా ఉండటంతో ప్రజలు వారి ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. పరిశుభ్రతలో మున్సిపల్ కార్పొరేషన్(Municipal Corporation) నిర్లక్ష్యంగా ఉందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. పెద్ద సంఖ్యలో దోమలు ఎగరడంతో ప్రజలు ఇళ్ల తలుపులు, కిటికీలు మూసివేసి బయటకు వెళ్లేందుకు కూడా భయపడుతున్నారు. దోమల వల్ల వచ్చే మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా లాంటి వ్యాధులతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆ వీడియోను ఓ నివాసి సోషల్ మీడియా(Social Media) లో షేర్ చేస్తూ 'పూణె(Pune) మునిసిపల్ కార్పొరేషన్ సకాలంలో పన్నులు చెల్లించినందుకు ప్రతిఫలంగా కేశవనగర్ వాసులకు వాలెంటైన్స్ బహుమతిని ఇచ్చింది' అని వ్యంగ్యంగా రాశారు.

Also Read : ఇది షాకింగ్.. ఎక్కువ పన్ను కడుతున్నది కార్పొరేట్లు కాదు.. ఎవరంటే..

#viral-video #social-media #mosquitoes #tornado
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe