General Elections 2024: ఈ సారి మోదీకి మరింత ఈజీ? 400 ఎంపీ సీట్లు పక్కానా?

సార్వత్రిక ఎన్నికల్లో(2024) 400ఎంపీ స్థానాలు గెలుచుకుంటామంటున్నారు బీజేపీ నేతలు. రాజస్థాన్‌, MP, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలే తమ ధీమాకు కారణమని చెబుతున్నారు. బీజేపీకి 400 ఎంపీ సీట్లు పక్కానా? తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్ మొత్తం చదవండి. హెడ్డింగ్‌పై క్లిక్‌ చేయండి.

New Update
General Elections 2024: ఈ సారి మోదీకి మరింత ఈజీ? 400 ఎంపీ సీట్లు పక్కానా?

సెమీ ఫైనలో.. క్వార్టర్‌ ఫైనలో ఎవరికి నచ్చింది వాళ్లు పిలుచుకోవచ్చు కానీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మాత్రం బీజేపీలో జోష్‌ను నింపాయి. సార్వత్రిక ఎన్నికల(Geneal Elections)కు మరికొన్ని నెలలే సమయం ఉండగా.. రాజస్థాన్‌(Rajasthan), మధ్యప్రదేశ్‌(MadyaPradesh), ఛత్తీస్‌గఢ్‌(Chattisgarh)లో బీజేపీ(BJP) సాధించిన విజయాలు ఆ పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సహాన్ని తీసుకొచ్చాయి. అటు కాంగ్రెస్‌(Congress) సైతం తెలంగాణను గెలుచుకున్నా.. ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లో అధికారాన్ని పొగొట్టుకుంది. మధ్యప్రదేశ్‌లోనూ శివరాజ్‌సింగ్‌ చౌహన్‌ దెబ్బకు చేతులేత్తేసింది. ఇది కాంగ్రెస్‌కు గట్టి దెబ్బగానే చెప్పాలి. మిజోరం ఎన్నికల ఫలితాలను పక్కన పెడితే మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలవడం విశేషం. అంటే బీజేపీ 3-1తేడాతో ఈ సెమీస్‌ విజయాన్ని సాధించింది. మరి ఫైనల్‌ సంగతేంటి? సెమీస్‌లో దుమ్మురేపినట్టే ఫైనల్‌లో భారీ స్కోరు సాధిస్తుందా? 400 ఎంపీ స్థానాలను గెలుచుకుంటుందా? లాస్ట్‌ టైమ్‌ సోలోగా సెహ్వాగ్‌ స్టైల్‌లో ట్రిపుల్‌ సెంచరీ కొట్టిన మోదీ ఈ సారి కాస్త ఓపిగ్గా లారా లెవల్‌లో 400 కొడతారా? లేకపోతే వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో ఇండియా బొక్కబోర్లా పడినట్లు ట్రోఫీని చేజార్చుకుంటారా?


12-3:
తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాలను బీజేపీ గెలుచుకుంది. కాంగ్రెస్‌ తెలంగాణతో సరిపెట్టుకుంటే బీజేపీ రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో విజయఢంకా మోగించింది. ఈ విజయాలతో బీజేపీ ఖాతాలో 12 రాష్ట్రాలు వచ్చి చేరాయి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, అసోం, చత్తీస్గఢ్, హర్యానా, ఉత్తరాఖండ్, త్రిపుర, మణిపూర్, గోవా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ సోలోగా ప్రభుత్వాన్ని రన్‌ చేస్తోంది. మహారాష్ట్ర, మేఘాలయ, నాగాలాండ్, సిక్కింలలో సంకీర్ణ ప్రభుత్వాల్లో భాగంగా ఉంది. అటు కాంగ్రెస్‌ పరిస్థితి మాత్రం బీజేపీకి పూర్తి భిన్నంగా ఉంది. దేశ జనాభాలో కేవలం 8.51 శాతం ఉన్న కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది.

publive-image
మూడు రాష్ట్రాల గెలుపుతో బీజేపీ సంబరాలు

గత ఎన్నికల్లో ఏం జరిగింది?
2019 ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఓట్లను లెక్కించి మే 23న ఫలితాలు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 303 స్థానాలు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్డీఏ కూటమి సంఖ్యను కలపకుండానే బీజేపీ 272 మ్యాజిక్‌ ఫిగర్‌ను క్రాస్ చేసింది. లోక్‌సభలో మొత్తం 543 ఎంపీ సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. వీటిలో అత్యధికంగా ఎంపీల సంఖ్య ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌. యూపీలో మొత్తం 80 ఎంపీ సీట్లు ఉన్నాయి.

publive-image 2019జనరల్ ఎలక్షన్స్‌లో మోదీ టీమ్‌ ప్రభంజనం(Paper Clip/TOI)

సార్వత్రిక ఎన్నికలపై ఎఫెక్ట్ పడుతుందా?
రానున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ ఈ మూడు(రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌) రాష్ట్రాల్లో బీజేపీ భారీగా ఎంపీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందా లేదా అన్నదానిపై విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలను ప్రజలు ఒకేలాగా చూడరని కొంతమంది వాదిస్తుండగా.. అసెంబ్లీ రాష్ట్రాల గెలుపే పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ కనిపించే అవకాశాలు ఉంటాయని మరికొంతమంది వాదిస్తున్నారు. గత ఎన్నికల్లో రిజల్ట్స్‌ ఎలా వచ్చాయో ఓ సారి గుర్తు చేసుకోమంటున్నారు.

publive-image ప్రతీకాత్మక చిత్రం

రాజస్థాన్‌:
మొత్తం 25 ఎంపీ స్థానాలున్న రాజస్థాన్‌లో గత 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 24 సీట్లు గెలుచుకుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా పార్లమెంట్‌ ఎన్నికల్లో మాత్రం కనీసం ఖాతా తెరవలేకపోయింది INC. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ బొక్కబోర్లా పడడంతో రానున్న జనరల్‌ ఎలక్షన్స్‌లో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.

ఛత్తీస్‌గఢ్‌:
ఛత్తీస్‌గఢ్‌లో గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. మొత్తం 11 ఎంపీ స్థానాలకు 9 స్థానాలను గెలుచుకుంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ గెలిచింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ బీజేపీ విజయం సాధించింది.

మధ్యప్రదేశ్‌:
ఇది బీజేపీకి కంచుకోటగా మారిన రాష్ట్రం. మొత్తం 29 ఎంపీ స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో 2019 సార్వత్రిక ఎన్నికల్లో 28 స్థానాలను గెలుచుకుంది బీజేపీ. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ను మట్టికరిపించింది. దీంతో రానున్న ఎన్నికల్లోనూ మధ్యప్రదేశ్‌లో బీజేపీ భారీగా ఎంపీ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.

publive-image
ఇండియాలో ఏ రాష్ట్రంలో ఎంతమంది ఎంపీలంటే?

తొమ్మిది మంది పోటి:
తాజాగా జరిగిన ఐదు రాష్ట్రల ఎన్నికల్లో మొత్తం 21 ఎంపీలను ఎమ్మెల్మే అభ్యర్థులుగా బరిలోకి దింపింది బీజేపీ. వారిలో 9మంది ఓటమి చవిచూశారు. ఓడిన వారిలో మధ్యప్రదేశ్ నివాస్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే కూడా ఉన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో ఏడుగురు చొప్పున, ఛత్తీస్‌గఢ్‌లో నలుగురు, తెలంగాణలో ముగ్గురు ఎంపీలను ఆ పార్టీ బరిలోకి దింపింది. వీరిలో నలుగురు కేంద్రమంత్రులు ఉన్నారు. తెలంగాణలో పోటీ చేసిన బీజేపీ ఎంపీలంతా ఓడిపోయారు. వీరంతా రానున్న ఎన్నికల్లో మళ్లీ ఎంపీ స్థానాలకు పోటి చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా బీజేపీకి ప్లస్ అంటున్నారు విశ్లేషకులు.

publive-image Image grab/ET

400సీట్లు సాధ్యమేనా:
గత ఎన్నికల్లో బీజేపీ పెద్ద రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు గెలుచుకోని కూటమితో సంబంధం లేకుండానే సోలోగానే ప్రభుత్వం ఏర్పాటు చేసే విక్టరీ కొట్టింది. యూపీలో మొత్తం 80 స్థానాలుంటే అందులో 62 స్థానాలు గెలుచుకోగా.. వచ్చే ఏడాది కూడా ఉత్తరప్రదేశ్‌లో ఇదే స్థాయి గెలుపు ఉంటుందన్న అంచనా ఉంది. ఇటు యూపీ తర్వాత అత్యధిక స్థానాలున్న మహరాష్ట్ర(48)లో బీజేపీ గత ఎన్నికల్లో 23ఎంపీ స్థానాలు గెలుచుకోగా.. ప్రస్తుతం శివసేనలోని షిండే వర్గంతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతోంది. ఇటు వెస్ట్‌ బెంగాల్‌లో థగ్‌ ఆఫ్‌ వార్‌ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం 42 ఎంపీ స్థానాలున్న పశ్చిమబెంగాల్‌లో గత ఎన్నికల్లో బీజేపీ 18స్థానాలతో సరిపెట్టుకుంది. ఇటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓడిపోయింది. ఇక అధికారంలో ఉన్న మమత బెనార్జీ టీఎంసీ ప్రస్తుతం INDIA కూటమిలో భాగంగా ఉంది. అటు బీహార్‌లో 40ఎంపీ స్థానాలు ఉండగా.. గతంలో మిత్రపక్షంగా ఉన్న నితీశ్‌కుమార్‌ మోదీతో వీడిపోయి INDIA కూటమికి మద్దతుగా నిలుస్తున్నాడు.

publive-image ఉత్తరాదిన బీజేపీ పట్టు- దక్షిణాదిన కాంగ్రెస్‌ సత్తా (Image credit/stackumbrella)

దక్షిణాదిన దెబ్బ పడుతుందా?
తాజాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇక ఈ ఏడాది కాంగ్రెస్‌ గెలుచుకున్న మరో రాష్ట్రం కర్ణాటక. ఈ రెండు దక్షిణాది రాష్ట్రాలు. ఇక మిగిలిన మూడు దక్షిణాది రాష్ట్రలైన ఏపీ, తమిళనాడు, కేరళలో బీజేపీకి ఓటు బలం చాలా తక్కువ. ఏపీలో టీడీపీతో పెట్టుకునే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇది వరకు వర్క్‌ అవుట్ అవుతుందో ఇప్పుడైతే చెప్పలేం. ఎందుకంటే తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ క్యాడర్‌ కాంగ్రెస్‌ సభల్లో కనిపించింది. కాంగ్రెస్‌కు నేరుగా సపోర్ట్ చేసింది. అటు తమిళనాడులో అన్నాడిఎంకే బీజేపీతో తమ ఫ్రెండ్‌షిప్‌ను కట్ చేసుకుంది. కేరళలో బీజేపీకి ఆదరణ తక్కువేనంటారు విశ్లేషకులు.

కర్ణాటకలో ఛాన్స్?
ఈ ఐదు రాష్ట్రల కలిపి 129 ఎంపీ స్థానాలున్నాయి. మొత్తం 543 సీట్లలో 400 సీట్లు గెలవాలంటే దక్షిణాదిన కూడా సీట్లు ఎక్కువగా గెలుచుకోవాల్సి ఉంటుంది. అది పొత్తులతోనే సాధ్యం. ఈ పొత్తులపై ఇప్పటివరకు స్పష్టమైన క్లారిటీ అయితే లేదు కానీ.. కర్ణాటక, తెలంగాణలో బీజేపీ భారీ స్థాయిలో ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని తీవ్రంగా ప్రయత్నించే అవకాశాలున్నాయి. కర్ణాటకలో మొత్తం 28 ఎంపీ స్థానాలు ఉండగా.. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 25 ఎంపీస్థానాలను గెలుచుకుంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం చావుదెబ్బ తిన్నది. అయితే ఎంపీ ఎన్నికలనే సరికి ప్రజలందరూ మోదీని చూసి ఓటు వేస్తారంటున్నారు బీజేపీ నేతలు. మోదీ ఛారిష్మాతోనే మరోసారి అధికారంలోకి వస్తామని.. ఈసారి ఏకంగా 400 ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Also Read: పడి లేచిన కెరటం రేవంత్‌రెడ్డి.. ఆయన జీవితం పోరాటాల పాఠం!

WATCH:

Advertisment
తాజా కథనాలు