Shashi Tharoor : కేంద్రం (Central) లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడం మంచిదే అని అన్నారు కాంగ్రెస్ (Congress) నేత శశిథరూర్. దీనివల్ల ప్రధాని మోదీ (PM Modi) తన ఇష్టం వచ్చినట్టు చేయడానికి కుదరదని అన్నారు. మొత్తం బీజేపీ (BJP) అంతా బాధ్యతగా, జవాబుదారీతనంతో వ్యవహరించవలసి ఉంటుందని చెప్పారు. గత పదేళ్ళల్లో వారి పాలనా విధానం చూశాము. నోట్ల రద్దులాంటి పెద్ద పెద్ద విషయాల్లో కూడా మోదీ ఎవరినీ సంప్రదించలేదు. క్యాబినెట్‌ను కూడా అడగలేదు. ముఖ్యమంత్రులకు సమాచారం కూడా ఇవ్వకుండా లాక్డౌన్ చేశారు. ఇక మీదట ఇలాంటి పనులు చేయడానికి వీలు పడదు. సంకీర్ణ ప్రభుత్వంలో మిత్ర పక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిందే అంటూ శశిథరూర్ వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా చదవండి..National : మోదీ ఇక మీదట అలా చేస్తే కుదరదు.. శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు
మూడోసారి మోదీ ప్రధాని అయ్యాక తన ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదని అన్నారు కాంగ్రెస్ ముఖ్య నేత శశిథరూర్. కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజార్టీ లభించనందువల్ల సంకీర్ణ ప్రభుత్వం అవసరమైంది. ఈ నేపథ్యంలో శశిథరూర్ ఈ వ్యాఖ్యలను చేశారు.
Translate this News: