National : మోదీ ఇక మీదట అలా చేస్తే కుదరదు.. శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు

మూడోసారి మోదీ ప్రధాని అయ్యాక తన ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదని అన్నారు కాంగ్రెస్ ముఖ్య నేత శశిథరూర్. కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజార్టీ లభించనందువల్ల సంకీర్ణ ప్రభుత్వం అవసరమైంది. ఈ నేపథ్యంలో శశిథరూర్ ఈ వ్యాఖ్యలను చేశారు.

New Update
National : మోదీ ఇక మీదట అలా చేస్తే కుదరదు.. శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు

Shashi Tharoor : కేంద్రం (Central) లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడం మంచిదే అని అన్నారు కాంగ్రెస్ (Congress) నేత శశిథరూర్. దీనివల్ల ప్రధాని మోదీ (PM Modi) తన ఇష్టం వచ్చినట్టు చేయడానికి కుదరదని అన్నారు. మొత్తం బీజేపీ (BJP) అంతా బాధ్యతగా, జవాబుదారీతనంతో వ్యవహరించవలసి ఉంటుందని చెప్పారు. గత పదేళ్ళల్లో వారి పాలనా విధానం చూశాము. నోట్ల రద్దులాంటి పెద్ద పెద్ద విషయాల్లో కూడా మోదీ ఎవరినీ సంప్రదించలేదు. క్యాబినెట్‌ను కూడా అడగలేదు. ముఖ్యమంత్రులకు సమాచారం కూడా ఇవ్వకుండా లాక్‌డౌన్‌ చేశారు. ఇక మీదట ఇలాంటి పనులు చేయడానికి వీలు పడదు. సంకీర్ణ ప్రభుత్వంలో మిత్ర పక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిందే అంటూ శశిథరూర్ వ్యాఖ్యలు చేశారు.

కొత్త ప్రభుత్వానికి సమర్థమైన ప్రతిపక్షంగా తాము పని చేసేందుకు సిద్ధమయ్యామని శశిథరూర్ చెప్పారు. ఎన్డీయే కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మెజార్టీ లభించింది... వారి హక్కును అడ్డుకునేందుకు తాము ఎలాంటి ప్రయత్నాన్ని చేయడం లేదని స్పష్టం చేశారు. మరోవైపు మల్లికార్జున ఖర్గే సైతం ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని స్పష్టమైన సంకేతాలిచ్చారు. సరైన సమయంలో తగిన అడుగులు వేయాలని నిర్ణయించామని తెలిపారు.

Also Read : నారా లోకేష్‌కు చంద్రబాబు కీలక పదవి!

Advertisment
తాజా కథనాలు