Actress Poonam Pandey Passes Away: వివాదాస్పద నటి, మోడల్ పూనమ్ పాండే (Poonam Pandey) కొద్ది సేపటి క్రితం మరణించారు. నటిగా, మోడల్ గా కంటే ఆమె క్రికెట్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు స్టేడియంలో నగ్నంగా తిరుగుతాను అని చెప్పి బాగా ఫేమస్ అయ్యింది. పూనమ్ గర్భాశయ క్యాన్సర్ తో (Cervical Cancer) చనిపోయినట్లు ఓ ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
అయితే ఈ విషయం ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పూనమ్ వయసు 32 సంవత్సరాలు. ఆమె చనిపోయిందని తెలిసిన ఆమె అభిమానులు షాక్ కి గురవుతున్నారు. ఆమె మేనేజర్ ఇన్‌స్టా గ్రామ్ (Instagram Post) లో '' ఈ ఉదయం మాకు చాలా కఠినమైనది. గర్భాశయ క్యాన్సర్ (Cervical Cancer) తో పూనమ్ పాండే మరణించారని తెలియజేయడానికి చాలా బాధపడుతున్నారు.
ఈ దుఃఖ సమయంలో ఆమెను , ఆమె పని తనాన్ని గుర్తు చేసుకోవాల్సి ఉందని '' రాసుకొచ్చారు. పూనమ్ ముందు మోడల్ గా కెరీర్ ప్రారంభించిన తరువాత 2013లో బాలీవుడ్ (Bollywood) లోకి నాషా అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది.అయితే పూనమ్ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కేవలం సోషల్ మీడియా ద్వారా మాత్రమే అబిమానులకు టచ్ లో ఉంటున్నారు.
ఆమె మరణించిన విషయం తెలిసి బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిన్నటి వరకు ఎంతో యాక్టివ్ గా ఉన్న ఆమె ఒక్కసారిగా చనిపోవడం ఏంటని అంతా షాక్ అవుతున్నారు.
Also read: బీఆర్‌ఎస్ కు పెద్ద షాక్..మర్రి జంప్!