MLC Kavitha: అందుకే విచారణకు రావడం లేదు.. ఈడీకీ లేఖ రాసిన కవిత..

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు ఈడీ తాజాగా నాలుగోసారి సమన్లు పంపి విచారణకు రావాలని ఆదేశించింది. ఇందుకు స్పందించిన కవిత తాను విచారణకు రాలేనంటూ ఈడీకి లేఖ రాసింది. సుప్రీంకోర్టు నుంచి తనకు రక్షణ కల్పించే ఉత్తర్వులు ఉన్నాయని.. తన కేసు పెండింగ్‌లో ఉండటం వల్ల రాలేకపోతున్నానంటూ తెలిపింది.

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు షాక్.. మరోసారి కస్టడీ పొడిగింపు
New Update

Kavitha Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మె్ల్సీ కవిత కూడా ఇరుక్కోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అప్పట్లో ఆమెను ఈడీ అధికారులు కూడా విచారణ చేశారు. దీంతో కవిత అరెస్ట్‌ అయ్యే ఛాన్స్ ఉందంటూ జోరుగా ప్రచారాలు కూడా జరిగాయి. ఇప్పటివరకు ఈడీ (ED) కవితకు మూడు సార్లు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జనవరి 15న కవితకు ఈడీ నాలుగోసారి నోటీసులు జారీ చేసింది.

Also read: లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ కసరత్తులు.. నేడు ఢిల్లీలో పార్టీ నేతలతో కీలక సమావేశం..

విచారణకు రాలేను

లిక్కర్‌ స్కామ్ కేసులో జనవరి 16వ తేదీ మంగళవారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారనకు రావాలంటూ సమన్లు పంపింది. ఇందుకు స్పందించిన ఎమ్మెల్సీ కవిత ఈడీకి లేఖ రాశారు. ఈ లిక్కర్ కేసు విచారణకు రాలేనంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నుంచి తనకు రక్షణ కల్పించే ఉత్తర్వులు ఉన్నాయని.. ఇప్పటికీ తన కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని అందుకే రాలేకపోతున్నానంటూ కవిత లేఖలో తెలిపారు.

ఎన్నికల వేళ మరోసారి నోటీసులు

అందుకే తాను ఈ విచారణననుకు రాలేనంటూ స్పష్టం చేశారు. ఇదిలాఉండగా.. కవితకు గతంలో మూడుసార్లు ఈడీ అధికారులు నోటీసులు పంపగా.. ఈ కేసులో తనను విచారించిన ఈడీ అధికారుల తీరుపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మహిళలను ఇంటివద్ద లేదా వీడియో విచారణ జరపేలా చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్‌లో పేర్కొంది. దీంతో కవితకు ఊరట లభించింది. కానీ ఇప్పుడు మరోసారి ఈడో నోటీసులు పంపింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చాలారోజుల తర్వాత కవితకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేయండతో.. బీఆర్‌ఎస్‌ పార్టీలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Also Read: అయోధ్యకు, భద్రాచలం రామాలయానికి మధ్య నాకు ఎలాంటి తేడా కనిపించడం లేదు- సీఎం

#telugu-news #telangana-news #mlc-kavitha #telangana-politics #delhi-liquor-scam-case
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe