Kavitha : ఓ మహిళగా బాధపడుతున్న.. కవిత ట్వీట్

రాజ్యసభలో రుతుక్రమ పోరాటాలను కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ జీ కొట్టిపారేయడం పట్ల ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఋతుస్రావం ఎంపిక కాదు.. ఇది జీవ వాస్తవికత అని ఆమె అన్నారు. కేంద్రమంత్రి మాటను ఆమె ఖండించారు.

New Update
MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు షాక్.. మరోసారి కస్టడీ పొడిగింపు

BRS MLC Kavitha : మహిళల బాధ పట్ల ఇలాంటి నిర్లక్ష్యాన్ని చూడాల్సి వస్తున్నందుకు ఓ మహిళగా బాధపడుతున్నానని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) పేర్కొన్నారు. నెలసరి సమయంలో మహిళలు పడే బాధను గమనించి సెలవు ఇవ్వాల్సింది పోయి కేంద్రమంత్రి ఆ విషయాన్ని కొట్టిపారేయడం విచారం కలిగించిందన్నారు. కాగా ఋతు స్రావం అనేది వైకల్యం కాదని అది స్త్రీ జీవిత ప్రయాణంలో ఓ భాగమని, అందుకు ప్రత్యేకం గా సెలవు ఇవ్వడం అవసరం లేదని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ALSO READ: BREAKING: సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

కాగా ఆమె వ్యాఖ్యలపై కవిత ఈరోజు ట్విట్టర్ వేదికగా స్పందించా రు. నెలసరి(Periods) తమకున్న ఎంపిక కాదని, అదొక సహజమైన జీవ ప్రక్రియ అని తెలిపారు. వేత నంతో కూడిన సెలవును తిర స్కరించడం అంటే మహిళల బాధను విస్మరించినట్లేనని ట్వీట్ చేశారు.

ALSO READ: పెన్షన్ రూ.3,000కు పెంపు…రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం


Advertisment
తాజా కథనాలు