MLC Kavitha Contest from Malkajgiri: తెలంగాణలో హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు సాధించగా.. మిత్రపక్షం సీపీఐ 1 సీటును సాధించింది. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) 39 సీట్లకు పరిమితం కాగా.. బీజేపీ 8 సీట్లను సొంతం చేసుకుంది. ఎంఐఎం ఏడుగురు ఎమ్మెల్యేలను గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో భారీగా సీట్లను సాధిస్తామని వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ మేజిక్ ఫిగర్ కన్నా కేవలం 4 సీట్లనే అధికంగా సాధించింది. దీంతో ఆ పార్టీ నేతలు పైకి ఆనందంగా ఉన్నా.. లోపల మాత్రం అసంతృప్తిగానే ఉన్నారు. మళ్లీ అధికారం తమదేనని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ కు తీవ్ర నిరాశను మిగిల్చాయి ఈ ఎన్నికలు. ఇప్పటికీ తాము అధికారం ఎందుకు కోల్పోయామో ఇప్పటికీ అర్థం కావడం లేదని చెబుతున్నారు గులాబీ నేతలు. అధికారం దక్కకపోయినా.. ఓట్ల శాతం 7 నుంచి 14 శాతానికి పెంచుకున్న బీజేపీ మాత్రం కాస్త ఖుషీగా ఉంది. దీంతో ఈ ఎన్నికలు ఏ పార్టీకి కూడా పూర్తి సంతృప్తిని మిగల్చలేదు.
ఇది కూడా చదవండి: TS Pensions: తెలంగాణలో పింఛన్ లు రూ.4 వేలకు పెంపు.. ఎప్పటినుంచంటే?
MLC Kavitha: ఈ సారి నిజామాబాద్ నుంచి కాదు.. ఈ ఎంపీ ఎన్నికల్లో కవిత పోటీ ఎక్కడంటే?
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కవిత మల్కాజ్ గిరి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎంపీ ఎన్నికల్లో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గెలిచిన ఈ సీటులో విజయం సాధించాలన్న లక్ష్యంతో కవిత వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం.
Translate this News: