MLC Kavitha: ఫేక్ ప్రామిస్‌లకు కేరాఫ్ కాంగ్రెస్.. ఆర్టీవీ స్టోరీని ట్వీట్ చేసిన ఎమ్మెల్సీ కవిత..

కర్నాటకలో వ్యవసాయానికి కేవలం 5 గంటల మాత్రమే విద్యుత్తును సరఫరా చేస్తున్నామని ఆ రాష్ట్ర మంత్రి ఆర్టీవీకి చెప్పారు. వీడియోపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్ (ట్విట్టర్) ద్వారా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ అని మండిపడ్డారు.

New Update
MLC Kavitha: కవితకు ఇంటి భోజనం ఇవ్వాలని ఆదేశించిన కోర్టు

MLC Kavitha: మోసపూరిత హామీలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్(Congress) అని బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్నాటక(Karnataka) కరెంట్ కష్టాలు తెలంగాణలోనూ పునరావృతం అవుతాయన్నారు. కర్నాటక రాష్ట్ర మంత్రి రామలింగ రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం అని పేర్కొన్నారు కవిత. ఈ మేరకు కర్నాటక మంత్రితో ఆర్టీవీ చేసిన ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో ట్వీట్ చేశారు ఎమ్మెల్సీ కవిత.

కర్నాటకలో వ్యవసాయానికి కేవలం 5 గంటల మాత్రమే విద్యుత్తును సరఫరా చేస్తున్నామని ఆ రాష్ట్ర మంత్రి ఆర్టీవీకి చెప్పారు. వీడియోపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్ (ట్విట్టర్) ద్వారా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ అని మండిపడ్డారు. 65 ఏళ్ల పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ.. రైతుల ఉసురు తీసుకుందని ఘాటు వ్యాఖ్యలతో విమర్శలు గుప్పించారు. ఇప్పుడు మరోసారి మభ్యపెట్టడానికి బయలుదేరిందన్నారు. 'కర్నాటకలో 5 గంటల కరెంట్ ఇస్తున్నారు. తెలంగాణలో మూడు గంటల పార్టీ కరెంటు చాలని పీసీసీ అధ్యక్షుడు అన్నారు. దీన్నిబట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తెలంగాణలో మూడు గంటల కరెంటే వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు' అని పేర్కొన్నారు కవిత.

Also Read: కాళేశ్వరం పై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంచలన నివేదిక

ఇదే సమయంలో తెలంగాణలో రైతుల కోసం తమ ప్రభుత్వం చేస్తున్న పనులను ఉదహరించారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణలో సీఎం కేసీఆర్.. రైతాంగానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్తును అందిస్తూ అండగా నిలుస్తున్నారని తెలిపారు. రైతులపై ఉన్న ప్రేమ, చిత్తశుద్ధితో సీఎం కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని వివరించారు. కాంగ్రెస్ పార్టీకి మాత్రం రైతుల పట్ల ఎటువంటి మమకారం, చిత్తశుద్ధి లేదన్నారు.

Also Read:ప్లీజ్ నన్ను మైలార్డ్ అని పిలవకండి…

Advertisment
Advertisment
తాజా కథనాలు