Telangana: లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసే పోటీ చేస్తాం.. కూనంనేని ఇంట్రస్టింగ్ కామెంట్స్‌

రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూలుస్తామని కొందరు నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. కేటీఆర్‌ కరెంట్ బిల్లులు చెల్లించవద్దని చెప్పడం సరైనా పద్దతేనా అంటూ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తామన్నారు.

New Update
Telangana : కూనంనేని సాంబశివరావుపై కేసు నమోదు.. ఎందుకంటే

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూలుస్తామని కొందరు నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారని విమర్శలు చేశారు. ప్రజల తీర్పును అగౌరపరచడం సరైంది కాదంటూ కౌంటర్లు వేశారు. కేటీఆర్‌ కరెంట్ బిల్లులు చెల్లించవద్దని చెప్పడం సరైనా పద్దతేనా అంటూ ప్రశ్నించారు.

Also Read: భారత వైద్యుల ఘనత..ఇద్దరు వ్యక్తులకు హ్యండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్

కాంగ్రెస్ పార్టీ వందరోజుల్లో గ్యారంటీలు అమలు చేయడం అంటే చట్టబద్దత రావడమేనని తెలిపారు. కొంచెం ఆలస్యం అయినా కాంగ్రెస్ గ్యారెంటీలు తప్పకుండా అమలు చేస్తుందని పేర్కొన్నారు. కానీ వంద రోజులు కూడా కాకముందే కేటీఆర్ ఇలా విమర్శలు చేయడం ఆయన అహంకారానికి నిదర్శనమనమంటూ విమర్శలు చేశారు. తాము తప్ప ఎవరికీ పరిపాలన చేసే హక్కులేదన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు కూనంనేని.

అలాగే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు కేవలం ఒకటి రెండు మాత్రమే ఎంపీ స్థానాలు వస్తాయంటూ జోస్యం చెప్పారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. అలాగే ఎన్నికల్లో స్నేహధర్మం పాటించి తాము కోరిన ఐదు నియోజకవర్గాల్లో ఒక సీటు ఇవ్వాలని కాంగ్రెస్‌ను కోరారు.

Also Read: రామాలయ ప్రారంభోత్సవానికి వస్తున్నా: నిత్యానంద

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు