KTR: మా తప్పు అదే.. అందుకే ఓడిపోయాం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేయడం వల్లే ఎన్నికల్లో ఓడిపోయామని అన్నారు. సీఎంగా కేసీఆర్‌ లేకపోవడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.

New Update
KTR: మా తప్పు అదే.. అందుకే ఓడిపోయాం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Siricilla MLA KTR: మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంపై వివరణ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ (BRS) లేకపోతే పార్లమెంట్‌లో (Parliament) తెలంగాణ ఉనికి లేకుండా పోతుందని అన్నారు కేటీఆర్. సీఎం రేవంత్‌ రెడ్డిని (CM Revanth Reddy) బీజేపీ నేత బండి సంజయ్ (BJP Bandi Sanjay) పొగుడుతున్నారని అన్నారు. దేశంలో దివాలా తీసిన పార్టీకి తెలంగాణలో అనుకోకుండా అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కావాలనే బీఆర్ఎస్ పార్టీపై అబద్ధాలు, అప్పులు, తప్పులు అంటూ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రైతు బంధు ఇప్పటివరకూ అతీగతీ లేదు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సొంత రాష్ట్ర పరపతిని తగ్గించే విధంగా కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.

ALSO READ: ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను.. జగ్గారెడ్డి సంచలన ప్రకటన?

అందుకే ఓడిపోయామేమో..

అభివృద్ధి విషయంలో ఎలాంటి ఫిర్యాదులు లేవని క్షేత్రస్థాయి నేతలు చెప్పారని కేటీఆర్‌ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. చిన్నచిన్న లోపాల వల్లే ఓడిపోయామని నేతలు చెప్పారని అన్నారు. ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్‌ అబద్ధాలు చెప్పి గెలిచిందని అభిప్రాయాలు చెప్పారని పేర్కొన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగాయని చెప్పారు. సీఎంగా కేసీఆర్‌ లేకపోవడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. తెలంగాణ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ పై జరిగిన దుష్ప్రచారం వల్లే ఓడిపోయామని కొందరు చెప్పినట్లు కేటీఆర్ తెలిపారు. పార్లమెంటు ఎన్నికలకు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తాం అని అన్నారు.

లోక్‌సభ ఎన్నికలపై పార్టీ నేతలతో సమావేశం..

లోక్‌సభ ఎన్నికల సన్నాహాక సమావేశాల్లో భాగంగా తెలంగాణ భవన్ లో ఈ రోజు ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్, పార్టీ సెక్రటరీ జనరల్‌ కే కేశవరావు, పార్టీ నేతలు ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి తదితర ముఖ్య నేతలతో పాటు ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ALSO READ: రేవంత్ సర్కార్ నిర్ణయం.. త్వరలో 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్?

Advertisment
Advertisment
తాజా కథనాలు