JOBS: రేవంత్ సర్కార్ నిర్ణయం.. త్వరలో 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్? తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు రేవంత్ సర్కార్ సిద్దమైనట్లు తెలుస్తోంది. టీచర్ ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముందుగా 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. By V.J Reddy 03 Jan 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Telangana Job Notification: తెలంగాణలో టీచర్ ఉద్యోగాల భర్తీపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. త్వరలోనే భారీగా టీచర్ ఉద్యోగాలను భర్తీ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మెగా డీఎస్సీగా పిలిచే ఈ భారీ రిక్రూట్‌మెంట్ చుట్టూ ఎన్నో ఆశలతో పాటు చిక్కులూ, అనుమానాలూ ఉన్నాయి. నిజానికి ఇంత కీలకమైన ఈ పరీక్షను గత 10 సంవత్సరాలలో ఒక్కసారి కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించలేదు. బీఆర్ఎస్ (BRS Party) ప్రభుత్వం మీద నిరుద్యోగుల్లో తీవ్రమైన అసంతృప్తికి కారణమైన అంశాల్లో ఇది ఒకటి. అదే సమయంలో టీచర్ ఉద్యోగాలు సహా మొత్తం 2 లక్షల గవర్నమెంటు ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ (Congress) ఇచ్చింది. ఆ క్రమంలోనే డిసెంబరు 30న విద్యా శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి త్వరలో మెగా డీఎస్సీ (DSC Notification) నిర్వహించాలని అధికారులను ఆదేశించడంతో ఒక్కసారిగా ఈ అంశంపై చర్చ మొదలైంది. అంతేకాదు, బడి లేని ఊరు ఉండకూడదు అని రేవంత్ చేసిన వ్యాఖ్యలతో టీచర్ నియామకాల సంఖ్య ఇంకా పెరుగుతుందని అభ్యర్థుల్లో ఆశ మొదలైంది. గత డీఎస్సీకి తెలంగాణ నుంచి లక్షా 72 వేల మంది పోటీ పడ్డారు. ఈసారి ఆ సంఖ్యపెరిగే అవకాశం ఉంది. ALSO READ: రేపు కేసీఆర్ ను కలవనున్న జగన్.. కారణమిదే? బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే ముందు, 2023 అక్టోబరులో ఒక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ ప్రక్రియ మధ్యలో ఉండగానే ఎన్నికలు వచ్చాయి. 2023 ఆగస్టు వరకూ ఉన్న ఖాళీల ఆధారంగా అప్పుడు 5,089 పోస్టులకు నోటిఫికేషన్ వేసినట్టు చెప్పారు. వాస్తవానికి అప్పట్లో విద్యాశాఖ మంత్రి వర్గ ఉప సంఘానికి ఇచ్చిన నివేదిక ప్రకారం 9,370 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. కానీ, అప్పటి ప్రభుత్వం పోస్టులను తగ్గించి నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఎన్నికల వల్ల ఆ రిక్రూట్‌మెంటే జరగలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ టీచర్ పోస్టుల భర్తీపై చర్చ జరుగుతూనే ఉంది. ప్రభుత్వం కూడా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో మెగా డీఎస్సీ అంశాన్ని చెప్పించింది. త్వరలోనే డీఎస్సీ వేస్తామని గవర్నర్ ప్రకటించారు. ఆ క్రమంలోనే తాజాగా సీఎం రేవంత్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో, అభ్యర్థులు పరీక్షకు సిద్ధమవుతున్నారు. అయితే పోస్టులు ఎన్ని అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో ఒక సందర్భంలో 13 వేల ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పింది. విద్యాశాఖ 9 వేలకు పైగా ఖాళీలు చెప్తే, చివరకు 5 వేల పైచిలుకు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం 9,800 అంటే దాదాపు పదివేల ఉద్యోగాలు భర్తీ చేయనుందంటూ వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి మొత్తంగా తెలంగాణలో 20వేలకు పైగా ఖాళీలు ఉన్నట్టు విద్యా శాఖ ఉన్నతాధికారుల అంచనా. తెలంగాణలో మొత్తంగా ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు ఒక లక్షా 22 వేలు కాగా, ప్రస్తుతం లక్షా 3 వేల మంది విధుల్లో ఉన్నారు. మిగిలిన దాదాపు 20 వేల పోస్టులూ భర్తీ చేయాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. ALSO READ: కాంగ్రెస్ 6 గ్యారెంటీలు.. ‘కాంగ్రెస్ 420 హామీలు’ పేరుతో బీఆర్ఎస్ సంచలన బుక్లెట్ మెగా డీఎస్సీ విషయంలో ప్రభుత్వ ప్రకటనలు వేగంగా ఉన్నా, వాస్తవంగా అంత వేగంగా రిక్రూట్‌మెంట్ అవుతుందా అన్నది పెద్ద ప్రశ్న. ఎందుకంటే టెట్ – టీఆర్టీ పరీక్ష నిర్వహించిన తరువాతే ఈ డీఎస్సీ పెట్టాలని కొందరు కోరుతున్నారు. అప్పుడు ఖాళీలు ఇంకా పెరుగుతాయని వారి వాదన. అంతేకాకుండా చాలా కాలంగా టీచర్ల ప్రమోషన్లూ, ట్రాన్స్‌ఫర్లూ పెండింగులో ఉన్నాయి. ఆ వ్యవహారం పూర్తయ్యాకే డీఎస్సీ పెట్టాలనీ, ప్రమోషన్ల సంగతి తేలిపోతే అప్పుడు రిక్రూట్మెంట్ సులువు అనేది మరొక వాదన. ప్రభుత్వం కూడా టెట్, ప్రమోషన్ల తరువాతే డీఎస్సీ అంటే మాత్రం మరో ఆరు నెలలు పడుతుందని విద్యా శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు, న్యాయపరమైన చిక్కులతోపాటు లోక్‌సభ ఎన్నికలు కూడా ఈ ప్రక్రియకు అడ్డం కావచ్చనేది వారి అనుమానం. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ లోపు డీఎస్సీ పూర్తి చేయాలని మరికొందరు విద్యార్థులు కోరుకుంటున్నారు. వచ్చే జూన్ లో కొత్త విద్యా సంవత్సరం మొదలవుతుంది. కనీసం రాబోయే విద్యా సంవత్సరం నుంచి అయినా పేదలు చదువుకునే పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉండేలా చూడాలి. ఇప్పటికే రాష్ట్రంలో ఆరు వేల స్కూళ్లు కేవలం ఒకే ఒక టీచర్‌తో నడుస్తున్నాయి. అలా కాకుండా మే లోపు ఈ భర్తీ పూర్తయితే కొత్త విద్యా సంవత్సరం నుంచి కొత్త ఉపాధ్యాయులతో విద్యార్థులకు ఉపయోగం ఉంటుందనేది అందరి అభిప్రాయం. అడ్డంకులు దాటి ప్రభుత్వం నియామక ప్రక్రియను అభ్యర్థులు ఆశించినట్టు పూర్తి చేయగలుగుతుందా అన్నది చూడాలి. #telangana-job-notifications #ts-teacher-jobs #cm-revanth-reddy #job-notification #dsc-job-notification మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి