Telangana: కేసీఆర్, కేటీఆర్‌పై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ ఘన్‌పూర్ కార్యకర్తలతో భేటీ అయ్యారు. తాను పార్టీ పార్టీ మారితే బీఆర్‌ఎస్‌కు ఎందుకని అన్నారు. వేరే వాళ్లు పార్టీ మారుతున్నప్పడు తాను మారితే అభ్యంతరం ఏంటన్నారు. తన కూతురుకు ఎంపీ టికెట్ ఇస్తానని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని తెలిపారు. By B Aravind 30 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Kadiyam Srihari Comments On KTR and KCR: ఇటీవల బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టేషన్ ఘన్‌పూర్ కార్యకర్తలతో కడియ శ్రీహరి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌పై (BRS) ఆయన తీవ్రంగా స్పందించారు. ' నేను పార్టీ మారితే బీఆర్‌ఎస్‌కు ఎందుకు భయం. పసునూరి దయాకర్, ఆరూరి రమేష్ పార్టీ మారితే లేని అభ్యంతరం నా విషయంలోనే ఎందుకు. ఉద్యమకారులకు కేసీఆర్ చేసిందేమి లేదు. ఒక్కరోజు కూడా కేసీఆర్, కేటీఆర్ ఉద్యమకారుల్ని దగ్గరికి రానివ్వలే. Also Read: అధికారంలోకి వస్తే 9 గ్యారెంటీలు, ప్రత్యేక హోదా ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు నా జీవితంలో ఒక్క అవినీతి మరకలేదు. నాపై మాట్లాడుతున్న నేతలపై అధికారం పోగానే.. ఎందుకు డజన్ల కొద్ది కేసులు అవుతున్నాయి. నా కుమార్తె కావ్యకు (Kavya) ఎంపీ టిక్కెట్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. పక్కనున్న పాలకుర్తి, జనగామలో అభివృద్ధి జరిగితే.. స్టేషన్ ఘన్‌పూర్ మాత్రం ఎందుకు వెనుకబడింది. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. ఇదిలాఉండగా.. ఇటీవల బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన అనంతరం కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య సీఎం రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) కలిశారు. త్వరలోనే వీరు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో వలసలు మొదలయ్యయి. పలువురు నేతలు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. తాజాగా కె. కేశవరావు, ఆయన కూతురు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఇక పార్లమెంటు ఎన్నికలు తెలంగాణలో మే 13వ తేదీన జరగనున్నాయి. Also Read: రేవంత్ రెడ్డితో నందమూరి సుహాసిని భేటీ.. త్వరలో కాంగ్రెస్లోకి? #brs #ktr #kcr #telugu-news #telangana-news #congress-party #kadiyam-srihari మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి