Ganta Srinivas: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా గంటా దీక్ష

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ విశాఖలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన గంటా శ్రీనివాస్‌.. సీఎం జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 16 నెలలు జైల్లో ఉన్న జగన్‌ మోహన్‌ రెడ్డి చంద్రబాబును సైతం జైల్లో పెట్టాలనే కుట్రతో లేని కేసులు ఆయనపై తోసి అక్రమంగా అరెస్ట్‌ చేయించారని మండిపడ్డారు.

TDP Ganta: భీమిలి లోకల్ మేనిఫెస్టో రిలీజ్.. కూటమి లక్ష్యం ఇదే..!
New Update

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ విశాఖలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన గంటా శ్రీనివాస్‌.. సీఎం జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 16 నెలలు జైల్లో ఉన్న జగన్‌ మోహన్‌ రెడ్డి చంద్రబాబును సైతం జైల్లో పెట్టాలనే కుట్రతో లేని కేసులు ఆయనపై తోసి అక్రమంగా అరెస్ట్‌ చేయించారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు ఒకప్పుడు జగన్‌ రావాలి మార్పు రావాలి అన్నారన్న ఎమ్మెల్యే.. ఇప్పుడు సైకో జగన్‌ పోవాలి సైకిల్‌ రావాలి అని గంటాస్పదంగా చెబుతున్నారని వెల్లడించారు. సైకో జగన్ అమరావతి ప్రజల జీవితాలను నాశనం చేశారని గంటా ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ సైకో పాలన వల్ల రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబుకు టీడీపీ నేతలు అందరూ అండగా ఉన్నారని గంటా శ్రీనివాస్‌ అన్నారు. చంద్రబాబు నాయుడు ఎలాంటి తప్పు చేయలేదన్న ఆయన.. బాబు అందరి మంచి కోరుకునే వారని, ప్రజల కోసం నిత్యం తపించే వారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి హైదరాబాద్‌ లాంటి రాజధానిని నిర్మించాలని చంద్రబాబు తాపత్రేయ పడితే జగన్‌ మాత్రం రాష్ట్రం అభివృద్ధి చెందకుండా చేశాడని మండిపడ్డారు. రాష్ట్రంలో పూర్తిగా మద్యాన్ని నిషేదిస్తానన్న జగన్‌ ఉన్న మద్యాన్ని నిషేదించలేదు కదా.. కొత్త మద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. జే మద్యం, బుల్ బుల్ మద్యం పేర్లతో మద్యాన్ని తీసుకువచ్చి ప్రజల ప్రాణాలు తీస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సైకో జగన్‌ పాలన వల్ల రాష్ట్రానికి వచ్చిన అనేక సంస్థలు వెనక్కి వెళ్లిపోయాయన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి కమీషన్‌లు ఇవ్వాలని జగన్‌ కండీషన్‌లు పెట్టినట్లు గంటా ఆరోపించారు. దీంతో రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్‌లు వేయడం లేదని గంటా శ్రీనివాస్‌ తెలిపారు. దీంతో ఉన్నత చదువులు చదివిన విద్యార్థులు కూలీ పని చేయలేక, ఖాళీగా ఉండలేక ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారని మాజీ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ పాలనలో అంతా అవినీతి అక్రమాలే జరిగాయి తప్పా అభివృద్ధి జరుగలేదని ఎమ్మెల్యే మండిపడ్డారు.

ALSO READ: దేశ రాజధానిలో మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ అరెస్ట్

#ycp #tdp #chandrababu #cm-jagan #deeksha #ganta-srinivas
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe