/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-3-4-jpg.webp)
ఇన్ని రోజులు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కులగణన ప్రధానమైన అంశమని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. 1931 తర్వాత జరిగిన జనగణనలో కులగణన జరగలేదన్నారు. అనేక మంది విప్లవకారులు సాధించలేనిది సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక్క సంతకంతో సాధించి చూపించారన్నారు. అనేక కుల సంఘాలు తమ వాణిని వినిపించేందుకు గత కొన్నేళ్లుగా ప్రయత్నించాయని ఆయన గుర్తు చేశారు. అర్హత ఉంటే చాలు వారు ఎక్కడున్నా వెతికి పట్టుకొని మరీ పథకాలు ఇస్తామని సీఎం జగన్ నిరూపించారన్నారు.
కులగణన జరిగితే ఆయా కులాల్లో వెనుకబడ్డ వారిని గుర్తించడం చాలా సులువు అవుతుందన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ బీసీలకు వరాలు ఇచ్చారని మంత్రి వేణు గుర్తు చేశారు. మరోవైపు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. బీసీలను వంచనకు గురి చేసింది చంద్రబాబే అని మంత్రి ఆరోపించారు. బీసీలను ఎదగనీయకుండా చంద్రబాబు అనేక అడ్డంకులు తీసుకొచ్చారని విమర్శించారు. చంద్రబాబు బీసీలను అనిచివేసిన పాపం తగిలిందన్నారు. ప్రస్తుతం చంద్రబాబు అంతకు మించి శిక్ష అనుభవిస్తున్నారని విమర్శించారు.
సీఎం జగన్ మాత్రం అందరి మేలు కోరుకుంటున్నాడన్నారు. పేద ప్రజలను అభివృద్ధిలోకి తీసుకురావడానికి జగన్ మోహన్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. అన్ని వర్గాల ప్రజల ఆదపలను గుర్తించి పలు పథకాల కింద వారికి నగదు సహాయం చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. గతంలో చంద్రబాబు అమరావతి గ్రాఫిక్స్ మాత్రమే చూపించి అమరావతి హైదరాబాద్‌లా మారుతుందని చెప్పుకొచ్చాడే కానీ అక్కడ ఒక్క ఇటుక కూడా పేరువలేక పోయారని విమర్శించారు. సీఎం జగన్ మాత్రం తప్పుడు ప్రకటనలు చయడం లేదన్నారు. తన వల్ల అయిందే చెబుతున్నారని, వాటిని వెంటనే అమలు చేస్తున్నారన్నారు.