PM Modi : ఎన్నికల(Elections) వేళ ప్రధాని మోదీ ముఖంలో భయం కనిపిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) వ్యాఖ్యానించారు. కరీంనగర్(Karimnagar)లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అర్బన్ టెర్రరిజంపై ప్రధాని చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు. ప్రధాని.. మాటలు విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని అన్నారు. గత పదేళ్లలో కరీంనగర్ కేంద్రం గాడిద గుడ్డు ఇచ్చిందంటూ ఎద్దేవా చేశారు. ‘ప్రసాద్’ పథకం కింద వేములవాడ ఆలయానికి నిధులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నలు సంధించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్క విద్యాసంస్థను కూడా ఏర్పాటు చేయలేదంటూ విమర్శలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ(Congress Party)ని అత్యధిక సీట్లలో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
పూర్తిగా చదవండి..Telangana : ప్రధాని మోదీ ముఖంలో భయం కనిపిస్తోంది : మంత్రి పొన్నం
ఎన్నికల వేళ ప్రధాని మోదీ ముఖంలో భయం కనిపిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అర్బన్ టెర్రరిజంపై ప్రధాని చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు.
Translate this News: