Microsoft Outage: మైక్రోసాఫ్ట్ సేవలకు అంతరాయం.. స్పందించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మైక్రోసాఫ్ట్ విండోస్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో దీనిపై పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా విమానశ్రయాల్లో అదనపు సీట్లు, మంచినీటి వసతి, ఆహారం సమకూర్చాలని ఎయిర్‌పోర్టు అధికారులు, ఎయిర్‌లైన్స్‌ను ఆదేశించామని తెలిపారు. By B Aravind 19 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ నేషనల్ New Update షేర్ చేయండి మైక్రోసాఫ్ట్ విండోస్‌లో (Microsoft outage) సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు, ఎయిర్‌పోర్ట్‌లలో అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం.. మైక్రోసాప్ట్‌తో నిరంతరం టచ్‌లో ఉందని తెలిపారు. ఈ సాంకేతిక సమస్యకు గల కారణాలను గుర్తించినట్లు ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. వీటి పరిష్కారానికి అప్డేట్లు విడుదలయ్యాయని పేర్కొన్నారు. మరోవైపు ఈ అంతరాయంతో దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్ట్‌లలో విమాన సేవల్లో జాప్యం జరుగుతోందని పౌరవిమానయానశాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా విమానశ్రయాల్లో అదనపు సీట్లు, మంచినీటి వసతి, ఆహారం సమకూర్చాలని ఎయిర్‌పోర్టు అధికారులు, ఎయిర్‌లైన్స్‌ను ఆదేశించినట్లు పేర్కొన్నారు. Also Read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇన్ఫోసిస్‌లో 20 వేల ఉద్యోగాలు! ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అర్థం చేసుకున్నామని.. వీలైనంత త్వరగా వారు గమ్యస్థానాలకు చేరుకునేలా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. మ్యాన్యువల్ బ్యాకప్ సిస్టమ్స్ ద్వారా పరిస్థితిని కొంతవరకు చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇదిలాఉండగా ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలకు అంతరాయం ఏర్పడటంతో పలు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలో విండోస్ 11, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. బ్లూ స్క్రీన్ ఎర్రర్ రావడంతో పలు సేవలు నిలిచిపోయాయి. భారత్‌తో పాటు అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఈ సమస్య తలెత్తింది. Also read: మనుషుల ఆయుష్షు పెంచే ప్రయోగం సక్సెస్.. #microsoft-windows #kinjarapu-rammohan-naidu #ashwini-vaishnaw #telugu-news #microsoft మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి