Infosys Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇన్ఫోసిస్‌లో 20 వేల ఉద్యోగాలు! టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫ్రెషర్స్‌కి గుడ్ న్యూస్ చెప్పింది. 2024-25లో 15 నుంచి 20వేల ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ విధానంలో రిక్రూట్ చేసుకుంటామని సీఎఫ్ఓ జయేష్ సంఘ్రాజ్కా స్పష్టం చేశారు. By srinivas 19 Jul 2024 in జాబ్స్ Latest News In Telugu New Update షేర్ చేయండి Infosys Advertisement Opportunity : టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సంస్థ ఫ్రెషర్స్‌కి భారీ శుభవార్త చెప్పింది. 2024-25 ఆర్థిక సంవత్సరం (2024-25 Financial Year) లో దాదాపు 20వేల మంది కొత్త ఉద్యోగులను నియమించుకునేందుకు కసరత్తులు మొదలుపెట్టింది. ఇప్పటికే 2024 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ 11వేల 900 మంది ఫ్రెషర్లను నియమించుకోగా.. 2024-25లో 15,000-20,000 మంది తాజా ఉత్తీర్ణులకు ఉద్యోగాలు ఇస్తామని, ఇందుకోసం ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ విధానంలో రిక్రూట్ చేసుకుంటామని సీఎఫ్ఓ జయేష్ సంఘ్రాజ్కా స్పష్టం చేశారు. గతంలో ఆఫర్ లెటర్లు ఇచ్చిన అందరికీ.. అయితే 2023 ఆర్థిక సంవత్సరంలో నియమించుకున్న 50వేల మంది ఫ్రెషర్ల కంటే 76 శాతం తక్కువ. కాగా ఈ త్రైమాసికంలో మా వద్ద 2వేల మంది ఉద్యోగుల నికర తగ్గుదల జరిగింది. ఇది గత త్రైమాసికాల కంటే తక్కువ. ఇప్పటికే మా యుటిలైజేషన్ 85 శాతం ఉన్నందున ఖాళీ తక్కువగానే ఉంది. వృద్ధిని బట్టి నియామకాలు చేపడతామని చెప్పారు. ఇక Q1లో రిక్రూట్ అయిన ఫ్రెషర్ల సంఖ్యను ఆయన వెల్లడించలేదు. గతంలో ఆఫర్ లెటర్లు ఇచ్చిన అందరినీ కంపెనీలోకి రప్పించినట్లు తెలిపారు. కంపెనీలో జూన్ త్రైమాసికంలోనూ ఉద్యోగుల సంఖ్య తగ్గింది. నికరంగా 1,908 మంది బయటకు వెళ్లడంతో జూన్ చివరకు మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,15,332కు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, 20,962 మంది తగ్గినట్లు తెలుస్తోంది. అలాగే కర్ణాటక రాష్ట్రం (Karnataka State) లో ప్రైవేటు కంపెనీల్లో స్థానికులకు అధిక అవకాశాలు కల్పించాలంటూ రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బిల్లుపై ఇన్ఫోసిస్ (Infosys) స్పందించింది. ప్రభుత్వ నిబంధనలు - మార్గదర్శకాలను ఇన్ఫోసిస్ పాటిస్తుందని సీఈఓ సలీల్ పరేఖ్ తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని మేం భావిస్తున్నాం. రాబోయే మార్గదర్శకాలు ఏవైనా మా మద్దతు ఉంటుందని చెప్పారు. ఇక ఈ బిల్లు ప్రకారం యాజమాన్య విభాగాల్లో 50%, యాజమాన్యేతర విభాగాల్లో 70% మేర స్థానికులను ప్రైవేటు కంపెనీలు తీసుకోవాల్సి ఉంటుంది. Also Read : పదేళ్లలో 4లక్షల మందిని కరిచిన కుక్కలు.. ఫలించని ABC ఆపరేషన్! #jayesh-sanghrajka #20-thousand-freshers #karnataka #infosys-job మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి