ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా డిఎస్సీని ఎటువంటి విమర్శలకు తావీయకుండా పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. టెట్, మెగా డీఎస్సీ నిర్వహణపై పాఠశాల విద్య ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. టెట్ నోటిఫికేషన్ విడుదల, మెగా డీఎస్సీకి సంబంధించి అధికారులతో పలు అంశాలపై చర్చించారు. టెట్, మెగా డీఎస్సీ మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. డీఎస్సీ ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై అభ్యర్థులు, విద్యార్థి, యువజన సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ చేయాలని సూచించారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: టెట్, మెగా డీఎస్సీపై మంత్రి లోకేష్ కీలక నిర్ణయం..
ఏపీలో మెగా డిఎస్సీని ఎటువంటి విమర్శలకు తావీయకుండా పారదర్శకంగా నిర్వహించాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. టెట్ నోటిఫికేషన్ విడుదల, మెగా డీఎస్సీకి సంబంధించి అధికారులతో పలు అంశాలపై చర్చించారు. డీఎస్సీ ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై అభిప్రాయ సేకరణ చేయాలని సూచించారు.
Translate this News: