Minister Lokesh: ఉన్నత విద్య అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యాదీవెన, వసతిదీవెన కింద వైసీపీ ప్రభుత్వం రూ.3,480 కోట్లు బకాయిలు పెట్టడం వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికారులతో చర్చించారు. విద్యాసంస్థలతో మాట్లాడి ముందు విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించాలని సూచించారు.
దాంతో పాటూ యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి చేపట్టాల్సిన చర్యలు, ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాల పెంపు, కరిక్యులమ్‌లో మార్పులు, విద్యార్థుల్లో నైపుణ్యత పెంచడానికి పాఠ్యాంశాల్లో మార్పులు, ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజులు, ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన, అడ్మిషన్ల పెంపుదలకు తీసుకోవాల్సిన చర్యలు, రూసా నిధుల వినియోగం మొదలగు వాటి మీద కూడా మంత్రి లోకేష్ సమీక్షించారు. వాటికి సంబంధించి కూడా త్వరలోనే నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు.