Telangana Minister KTR: మంత్రి కేటీఆర్.. అనగానే క్లాస్, మాస్ కలగలిపిన అచ్చమైన తెలంగాణ పొలిటిషన్ అని అనిపిస్తుంటుంది. ఆయన మాటలు, ఆయన ఆహార్యం, ఆయనకున్న జ్ఞానం.. అనన్యసామాన్యం. ఆయన వాక్చాతుర్యానికి యావత్ దేశమే ఫిదా అయిపోతుంది. ఆయనలోని విషయ పరిజ్ఞానానికి యావత్ ప్రపంచమే సలాం కొట్టింది. ఇక ఆయన ప్రజలతో మమేకయ్యే విధానానికి ఫిదా అయిపోయి జనాలు కేటీఆర్‌ను ఆప్యాయంగా రామన్నా అని పిలుచుకుంటారు. ఆయన నవ్వుతూ, నవ్విస్తూ మాట్లాడుతుంటే.. మంచి స్నేహితుడు, ఒక సోదరుడు, ఒక మెంటార్ మాట్లాడుతున్నట్లుగానే ఉంటుంది. అందుకే.. ఆయన అభిమానులు ఎక్కువ. పెద్దలు, యువకులే కాదు.. పిల్లల్లోనూ ఆయనను అభిమానించే వారి సంఖ్య ఎక్కువ.
ఇదంతా ఇలా ఉంటే.. శుక్రవారం నాడు మంత్రి కేటీఆర్ 'సీఎం అల్పాహార పథకం'ను ప్రారంభించారు. సికింద్రాబాద్‌లోని వెస్ట్ మారేడ్‌పల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ పథకాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులతో కలిసి అల్పాహారం తిన్నారు. వారితో కలిసి కూర్చుని తింటూ సరదాగా కబుర్లు చెప్పారు. ఈ క్రమంలోనే కొందరు విద్యార్థులు అటుగా వెళ్తుంటే.. తన వద్దకు పిలుచుకున్నారు మంత్రి కేటీఆర్. ఆ అబ్బాయిల పేర్లు, ఇతర వివరాలు అన్నీ అడిగారు. ఏం పేరు, ఏం చదువుతున్నారు. ఏం అవ్వాలనుకుంటున్నారు.. చదువులో రాణిస్తున్నారా? వంటి వివరాలను సరదాగా అడిగారు. అదే సమయంలో తల్లిదండ్రులు ఏం చేస్తారని ప్రశ్నించగా.. తండ్రి జాబ్ చేస్తారని, అమ్మ ఏమీ చేయదని స్టూడెంట్ బదులిచ్చాడు. దానికి మంత్రి ఇచ్చిన సమాధానం ఇప్పుడు అందరినీ హత్తుకుంటుంది. ఆ ఒక్క సమాధానానికి సోషల్ మీడియా, మహిళా లోకం ఫిదా అయిపోయింది.
కేటీఆర్ ఏమన్నారంటే..
పిల్లలను మీ అమ్మగారు ఏం చేస్తారని ప్రశ్నించగా.. ఏమీ చేయదని బదులిచ్చారు. దాంతో ఇంకెప్పుడు అలా అనకండి అంటూ పిల్లలకు సూచించారు మంత్రి కేటీఆర్. 'అమ్మను హౌస్ వైఫ్ అని ఎప్పుడూ అనకండి. అమ్మ మీ అందరినీ నడిపిస్తుంది. అసలు మీరందరూ బాగున్నారంటే దానికి కారణం అమ్మ. అమ్మ ఏమీ చేయదని ఎప్పుడు చెప్పకండి.' అంటూ విద్యార్థులకు చెప్పారు మంత్రి కేటీఆర్. పిల్లలు, మంత్రి కేటీఆర్ మధ్య జరిగిన ఈ సరదా సంభాషణకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియో ఇదే..
Also Read:
ఆ బాధ నీకెందుకయ్యా రేవంతు.. ఎంపీ అరవింద్ మాస్ కామెంట్స్..
కాంగ్రెస్ సంచలన హామీ..పెళ్లి సమయంలో ఆడపిల్లలకు తులం బంగారం..!