Telangana: అదే జరిగితే రేవంత్ ఎప్పుడో జైలుకెళ్లేవాడు.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్..
తాము ప్రతీకార రాజకీయాలు చేసుంటే రేవంత్ రెడ్డి ఎప్పుడో జైలుకు వెళ్లేవాడని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ అభివృద్ధిపైనే తాము ఫోకస్ పెట్టామన్నారు. దశాబ్దాల పాటు తెలంగాణ ఆకాంక్షలను అణచివేసింది కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. నాడు సోనియాను బలిదేవత అన్నది రేవంతే అని గుర్తు చేశారు కేటీఆర్. భారత దేశానికి తెలంగాణ దిక్సూచి అని పేర్కొన్నారు. అది కేసీఆర్ సాధించిన ఘనత అని అన్నారు. తెలంగాణ ఆచరిస్తోంది.. దేశం అనుసరిస్తోందని పేర్కొన్నారు.
Minister KTR: తాము ప్రతీకార రాజకీయాలు చేసుంటే పీసీసీ అధ్యక్షుడు రేవంత్(Revanth Reddy) ఇప్పటికే జైల్లోనే ఉండేవాడని వ్యాఖ్యానించారు మంత్రి కేటీఆర్. ఉన్న తెలంగాణను ఆనాడు ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ(Telangana) ఆకాంక్షను దశాబ్దాల పాటు కాంగ్రెస్ అణచివేసిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని హామీ ఇచ్చిన సోనియా మోసం చేశారని.. దాంతో వందల మంది బలిదానాలు చేసుకున్నారని.. సోనియా గాంధీని బలిదేవత అని అన్నది నాడు రేవంత్ రెడ్డేనని గుర్తుచేశారు. కాంగ్రెస్ చేసిన పాపానికి తెలంగాణ 58 ఏండ్లు బాధపడిందని కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు.
దేశానికి తెలంగాణ దిక్సూచి..
భారత దేశానికి తెలంగాణ దిక్సూచి అయిందని .. అది సీఎం కేసీఆర్ సాధించిన ఘనత అని పేర్కొన్నారు. నేడు తెలంగాణ ఆచరిస్తున్నది.. దేశం అనుసరిస్తున్నదని వ్యాఖ్యానించారు. తాము రాష్ట్రాన్ని అప్పులపాటు చేశారన్న ఆరోపణలు సరికాదన్నారు. అప్పులు చేసిన నిధులు సంపద సృష్టికి ఉపయోగిస్తున్నామని చెప్పారు. రుణాలను మొత్తం సాగునీటి రంగం, మిషన్ భగీరథకు వినియోగించామన్నారు. ఐటీ రంగంలో బెంగళూరును హైదరాబాద్ దాటేసిందని చెప్పారు. ఐటీ ఎగుమతులు 400 శాతం పెరిగాయని తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు. 2014లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.లక్షా 14 వేలుగా ఉందని, ప్రస్తుతం అది రూ.3లక్షల 17 వేలకు పెరిగిందన్నారు.
కాంగ్రెస్ హయాంలో పదేళ్లలో తెలంగాణలో ఏడాదికి వెయ్యి ఉద్యోగాలు వస్తే.. తాము తొమ్మిదిన్నరేండ్లలో 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. మరో 90 వేల ఉద్యోగ నియామకాలు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పుడు 33 జిల్లాల్లో వైద్య కళాశాలలు ఉన్నాయని చెప్పారు. ఒకప్పుడు మైగ్రేషన్‌కు కేరాఫ్‌గా ఉన్న పాలమూరు ఇప్పుడు ఇరిగేషన్‌కు కేరాఫ్‌గా మారిందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌ను బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూపుమాపిందని చెప్పారు. ముస్లిం మైనార్టీలకు దేశంలోని ఏ రాష్ట్రంలో లేనంత బడ్జెట్ తెలంగాణలోనే ఉందని వెల్లడించారు.

Also Read:
కాంగ్రెస్‌లో వారికి జాక్‌పాట్.. పార్టీలో చేరడమే ఆలస్యం టికెట్ల కేటాయింపు..
సీఎం జగన్ పథకాలపై జేడీ లక్ష్మీనారాయణ పొగడ్తల వర్షం.. ఫుల్ ఖుషీలో వైసీపీ ఫ్యాన్స్..
🔴Live News Updates: హైదరాబాద్ లో భారీ వరదలు.. రంగంలోకి హైడ్రా
Stay updated with the Latest News In Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
HYD RAINS : హైదరాబాద్ లో భారీ వరదలు.. రంగంలోకి హైడ్రా
వర్షాలకు నీట మునిగిన ప్రాంతాలను హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Hair Tips: వర్షాకాలంలో చుండ్రు, దురద ఇబ్బంది పెడుతుందా..? ఈ జాగ్రత్తగా తెలుసుకోండి
వర్షాకాలంలో జుట్టు తడుపు కోవటం మానుకోవాలి. వారానికి 2,3 సార్లు తేలికపాటి షాంపూతో జుట్టు కడుక్కోవడం సరైన పద్దతి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Narayanapur Encounter : నారాయణ్‌పూర్‌లో ఎన్కౌంటర్. ఆరుగురు మృతి
వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో సతమతమవుతున్న మావోయిస్టులకు మరో షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్... క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
Russia-Ukraine War: నీళ్లకు బయపడుతున్న రష్యా సైనికులు.. ఉక్రెయిన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు
ఇటీవల నలుగురు రష్యా సైనికులు తోటి సిబ్బంది ముందు ప్రాణాలు కోల్పోయారు. వాళ్లు విషం కలిపిన నీళ్లు తాగడం వల్లే ఇలా మృతి చెందినట్లు తెలిసింది. Short News | Latest News In Telugu
Soaked Dry Fruits: మీ శరీర బలాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా..? అయితే ఇవి తినాల్సిందే
అంజీర్ పండ్లలో ఉండే పొటాషియం శరీరంలో సోడియం స్థాయిలను సమతుల్యంగా ఉంచుతుంది. ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Youtube: కంటెంట్ క్రియేటర్లకు గుడ్‌న్యూస్.. యూట్యూబ్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్
HYD RAINS : మరో రెండు రోజులు వర్షాలు..ఆరెంజ్ అలర్ట్ జారీ