Telangana Elections 20203: కాంగ్రెస్ నేతలకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చిన కేటీఆర్‌..

సిరిసిల్ల నియోజకవర్గం ముస్తాబాద్‌లోని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేటీఆర్‌ కాంగ్రెస్ నేతలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ నేతలకు 24 గంటలు కనిపించకపోతే ముస్తాబాద్‌ వచ్చి కరెంటు తీగలు పట్టుకోవాలని కావాలంటే తాను ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేస్తానంటూ ఛలోక్తులు విసిరారు.

New Update
Telangana Elections 20203: కాంగ్రెస్ నేతలకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చిన కేటీఆర్‌..

మరికొన్ని రోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా నాయకుల సభలు, ప్రసంగాలు, ప్రచారాలతో ఎన్నికల వేడి నెలకొంది. అయితే తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గం ముస్తాబాద్‌ రోడ్డు షోలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌ పార్టీకి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ' తెలంగాణలో 24 గంటలు కరెంటు కాంగ్రెస్ నేతలకు కనిపిస్తలేదటా.. అయితే ముస్తాబాద్‌ రండి.. ఎప్పుడు వస్తారో చెప్పండి కావాలంటే నేనే బస్సు ఏర్పాటు చేస్తా. వచ్చాక లైన్‌లో నిల్చొని మండలంలో ఉన్న కరెంట్‌ వైర్లు పట్టుకోని చూడండి. అప్పుడు మీకే కరెంట్ ఉందా లేదా అనేది తెలిసిపోతుందంటూ' అన్నారు.

Also read: కేసీఆర్ అందుకే అలా చెబుతున్నాడు.. భట్టి కీలక వ్యాఖ్యలు!

మీరు దివిస్తేనే ఎమ్మెల్యే అయ్యాయని.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశీర్వాదంతో మంత్రి అయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో సిరిసిల్ల నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో ఉండేలా చేశానని.. నేను ఎమ్మెల్యే అయ్యాక మీరు గౌరవంగా తల ఎత్తుకునేలా పని చేశానంటూ వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ఆ పార్టీ వాళ్లు, ఈ పార్టీ వాళ్లు చెప్పేది వినొద్దని.. మనస్పూర్తిగా ఆలోచించి తనకు ఓటేయ్యండని కేటీఆర్‌ కోరారు. అలాగే తెలంగాణ రాష్ట్రం మీద ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉన్నంత ప్రేమ ప్రధాని మోదీకి, రాహుల్ గాంధీకి ఉంటుందా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ వాళ్లు ధరణి ఎత్తేస్తామని అంటున్నారని.. అలా జరిగితే మళ్లీ పట్వారీ వ్యవస్థ వస్తుందని అన్నారు. వాళ్లు 3 గంటలే కరెంటు ఇస్తున్నామని చెబుతున్నారని.. ఇలా చేస్తే మళ్లీ బాయి కాడికిపోయి పడుకునే పరిస్థితి ఉంటుందని తెలిపారు. మళ్లీ ఎరువుల కోసం, విత్తనాల కోసం రైతులు క్యూ లైన్లు కట్టే పరిస్థితులు కూడా వస్తాయని పేర్కొన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు