Israel-Hamas War: ఇజ్రాయెల్‌పై దాడి ఉగ్రవాద చర్యే.. జైశంకర్ సంచలన వ్యాఖ్యలు

ఇజ్రాయెల్‌పై హమాస్ జరిగిన దాడి ఉగ్రవాద చర్యేనని కేంద్రమంత్రి జైశంకర్ అన్నారు. ఇజ్రాయెల్,గాజా ప్రాంతాల్లో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని ఈ సంఘర్షణలు సర్వసాధారణం కాకూడదని పేర్కొన్నారు. అలాగే పాలస్తీనా సమస్యకు పరిష్కార మార్గం చూపించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

New Update
Jaishankar: నెహ్రూ హయాంలోనే చైనా స్వాధీనం చేసుకుంది: విదేశాంగ మంత్రి జైశంకర్

ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న భీకర దాడులు ఇంకా చల్లారడం లేదు. ఇప్పటికే ఈ దాడుల్లో వేలాదిమంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్‌7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడులు తీవ్రవాద చర్యేనని అన్నారు. ఉగ్రవాదం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ఇటలీలోని రోమ్‌లో నిర్వహించిన ఓ సదస్సులో పాల్గొన్న ఆయన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం గురించి మాట్లాడారు. ఉగ్రవాద చర్యల వల్ల ఇజ్రాయెల్, గాజా ప్రాంతాల్లో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని.. అయితే ఈ సంఘర్షణలు సర్వసాధారణం కాకూడదని అందరూ కోరుకోవాలని తెలిపారు. మళ్లీ ఆ ప్రాంతాల్లో స్థిరత్వం ఏర్పడుతుందని అందరూ నమ్మకంతో ఉండాలని కోరారు. ఇప్పుడు నెలకొన్న రెండు విభిన్నమైన సమస్యలకు పరిష్కారం వెతకాలని.. అది ఉగ్రవాదమైతే దానికి అందరం కలిసి వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు.

Also Read: తెలంగాణ ఎన్నికలకు వైఎస్సార్టీపీ దూరం: షర్మిల సంచలన ప్రకటన

అలాగే పాలస్తీనీ సమస్యకు కూడా పరిష్కార మార్గం చూపించాలని తెలిపారు. ఈ విషయంలో 'టూ స్టేట్స్ విధానం' అయితే సరైన పరిష్కారమని మా అభిప్రాయమని పేర్కొన్నారు. ఇక యుద్ధం, ఉగ్రవాదం వల్ల సమస్యలకు పరిష్కారం లభించదని.. చర్చలు, సంప్రదింపుల ద్వారానే సమస్యకు పరిష్కారం కనుగోనాల్సి ఉంటుందని అన్నారు. ఇందుకు తాము మద్దతిస్తామని.. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అంతర్జాతీయ మానవతా చట్టాన్ని ప్రతిఒక్కరూ గౌరవించాలని తాము విశ్వసిస్తున్నామని తెలిపారు. చాలా కష్టమైన, సంక్లిష్టమైన పరిస్థితిని పరిష్కరించడంలో ఇది చాలా ముఖ్యమైన భాగమని పేర్కొన్నారు.

Also Read: అమెరికాకు అక్రమ ప్రవేశం చేస్తూ పట్టుబట్ట 97వేల మంది భారతీయులు..

Advertisment
Advertisment
తాజా కథనాలు