అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న భారతీయుల సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. 2022 అక్టోబర్ నుంచి 2023 సెప్టెంబర్ మధ్య అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన 96,917 మంది భారతీయులను అదుపులోకి తీసుకున్నట్లు యూఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ ఏజెన్సీ తెలిపింది. అయితే గత కొన్నేళ్లుగా ప్రమాదకర మార్గాల నుంచి అక్రమంగా ప్రవేశించడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ కూడా వీరు తమ ప్రయత్నాలను ఆపడం లేదు. అధికారులకు పట్టుబడ్డ 96,917 మంది భారతీయుల్లో.. 30,010 మంది కెనడా సరిహద్దు వద్ద, 41,770 మంది అమెరికా-మెక్సికో సరిహద్దు వద్ద పట్టుబడ్డారు. మిగిలినవారు అక్రమంగా చొరబడ్డ తర్వాత చిక్కారు. అయితే ఇవి కేవలం రికార్ట్ అయిన కేసులు మాత్రమేనని.. వాస్తవానికి ఇలా అక్రమంగా ప్రవేశించేవారి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. 2019-2020 మధ్య 19,883 మంది పట్టబడగా.. 2022-2023 నాటికి 96,917 కి చేరుకుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పూర్తిగా చదవండి..అమెరికాకు అక్రమ ప్రవేశం చేస్తూ పట్టుబట్ట 97వేల మంది భారతీయులు..
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన 96 వేల మంది భారతీయులు అక్కడి అధికారులకు పట్టుబడటం కలకలం రేపుతోంది. గత నాలుగేళ్లగా వీరి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఇలా అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.
Translate this News: