టీడీపీ అధినేత చంద్రబాబుపై చురకలు అంటించారు మంత్రి అంబటి రాంబాబు. తుఫాన్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తుఫాన్‌పై ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాలు.. ముందస్తు చర్యలతో తీవ్రనష్టం తప్పింది అని అన్నారు. ప్రతీ సంక్షోభాన్ని రాజకీయాల కోసం చంద్రబాబు వాడుకుంటున్నారని మండిపడ్డారు.
ALSO READ: జగన్ ను ఓడించేందుకు షర్మిల?.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు
సీఎం జగన్‌పై చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులను సీఎం పరామర్శించడాన్ని చంద్రబాబు తప్పుబడుతున్నారని ఫైర్ అయ్యారు. తుఫాన్‌లు వచ్చినప్పుడు చంద్రబాబు ఎంత నష్టపరిహారం ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ హయాంలో తుఫాన్ ద్వారా నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ.17వేలు నష్టపరిహారం ఇస్తున్నామని స్పష్టం చేశారు.
చంద్రబాబులా షో చేయడం జగన్‌కు అలవాటు లేదు అని చురకలు అంటించారు. ఈ రాష్ట్రంలో కొత్త ప్రాజెక్ట్‌లు కట్టింది వైఎస్సార్ అని గుర్తు చేశారు. గుండ్లకమ్మ ప్రాజెక్టును కూడా ప్రారంభించింది వైఎస్సారే అని పేర్కొన్నారు. టీడీపీ అలసత్వం వల్ల గుండ్లకమ్మ ప్రాజెక్టుకు నష్టం కలిగింది అని ఫైర్ అయ్యారు మంత్రి అంబటి రాంబాబు.
ALSO READ: కౌంటింగ్ మెషీన్లే అలసిపోతున్నాయ్!.. ఒడిశాలో ఐదు రోజులుగా నోట్ల గుట్టల లెక్కింపు