India : మరికొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections) జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్(Microsoft).. సంచలన విషయాలు వెల్లడించింది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకునే ప్రమాదం ఉందంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఇందుకోసం అర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్(AI) సాయంతో.. సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశాలున్నట్లు పేర్కొంది. ఒక్క భారత్‌లో మాత్రమే కాదు.. అమెరికా, సౌత్ కొరియాలో కూడా ఇదే జోక్యం చేసుకునేందుకు కుట్ర పన్నుతోందని తెలిపింది. ఏఐ నుంచి వచ్చే కంటెంట్‌తో అందరినీ తప్పుదోవ పట్టించాలని భావిస్తోందని పేర్కొంది.
Also read: అలా చేస్తే కచ్చతీవు ఇచ్చేస్తాం.. భారత్‌కు శ్రీలంక షరతు
64 దేశాల్లో ఎన్నికలు
ఇదిలా ఉండగా.. తైవాన్ అధ్యక్ష ఎన్నికల సమయంలో కూడా చైనా.. ఇందుకు సంబంధించి ట్రయల్ రన్ కూడా చేసినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ఈ ఏడాది దాదాపు 64 దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అంతేకాదు ప్రపంచ జనాభాలో ఈ 64 దేశాల వాటా ఏకంగా 49 శాతం ఉంది. అంటే ఎన్నికలకు ముందు ప్రపంచంలోని సగం జనాభా అభిప్రాయలను ప్రభావితం చేసేందుకు చైనా ప్రణాళికలు చేస్తోన్నట్లు తెలుస్తోంది. అయితే మైక్రోసాఫ్ట్ ఇంటిలిజెన్స్ బృందం పలు కీలక విషయాలు వెల్లడించింది.
గతంలో ప్రమాదాలకి చైనాయే కారణం
' చైనా(China) కి చెందిన పలు సైబర్ గ్రూప్(Cyber Groups) లు ఎన్నికలను ప్రభావితం చేయనున్నాయి. ఈ గ్రూప్‌లకు మద్దతుగా ఉత్తర కొరియాలో కొన్ని టీమ్‌లు కూడా పనిచేస్తున్నాయి. తమ దేశానికి అనుకూలంగా ఈ ఎన్నికల ఫలితాలను మార్చేందుకు చైనా అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కంటెంట్‌తో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారాలు చేయనుంది. చైనాకి చెందిన ఈ గ్రూప్‌లో అమెరికాతో సహా.. ఎన్నికలు జరగనున్న అన్ని దేశాల్లో కూడా ఇప్పటికే నిశ్శబ్దంగా ప్రచారాలను మొదలుపెట్టారని' మైక్రోసాఫ్ట్ ఇంటిలిజెన్స్ తెలిపింది. అంతేకాదు గత ఏడాది.. కెంటకీలో ఓ రైలు పట్టాలు తప్పిపోవడానికి.. అంతకు ముందు మయూలో కార్చిచ్చులు రగలడానికి కారణం చైనాయేనని చెప్పింది. అలాగే జపాన్‌లో న్యూక్లియర్ వేస్ట్‌వాటర్ ప్రాజెక్ట్, ఇంకా అమెరికాలో డ్రగ్స్ వినియోగం వంటి అనేక విషయాల్లో కూడా చైనా తలదూరుస్తోందని వెల్లడించింది.
Also Read: ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 19 ఏళ్ల అమ్మాయి!